Gold Price : 10 గ్రాముల బంగారం ధర రూ. 88,500 .. సరికొత్త రికార్డులో పసిడి!

బ్రేకులు లేకుండా బంగారం ధర పెరుగుతోంది. రోజు రోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. సామాన్యులు కొనుగోలు చేయలేని స్థితిలో పసిడి పరుగులు పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర సరికొత్త రికార్డును నమోదు చేసింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా రూ. 88, 500 వద్ద జీవకాల గరిష్టానికి తాకింది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2430 పెరిగింది. గత వారం 99.9 స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 86, 070 ఉంది. ఒక్కసారి రెండు వేల రూపాయలకు పైరగడం అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి క్షీణత వల్ల పసిడి ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు.
అటు కేజీ వెండి సైతం రూ.97 ,500 లకు చేరింది.

సరికొత్త రికార్డులో పసిడి:
రిటైల్‌గా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు 22 క్యారెట్ల గ్రాముకు చెన్నైలో రూ. 7,980, ముంబైలో రూ .7,980, ఢిల్లీలో రూ . 7,995, కోల్‌కతాలో రూ. 7,980, బెంగళూరులో రూ. 7,980, హైదరాబాద్ లో రూ ₹7,980, కేరళలో రూ. 7,980, పూణేలో రూ. 7,980, బరోడాలో గ్రాము బంగారం రూ . 7989, అహ్మదాబాద్ లో రూ. 7,985 లకు చేరింది. నిన్నటితో పోల్చితే గ్రాముకు రూ. 35 పెరిగింది. 100 గ్రాములకు రూ.3500 మేరకు పెరిగింది.

The price of 10 grams of gold is Rs 88 500 It has increased by Rs 2430 in a single day

అటు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు చెన్నైలో రూ. 8,706, ముంబైలో రూ. 8,706, ఢిల్లీలో రూ 8,721, కోల్‌కతా రూ. 8,706, బెంగళూరులో రూ 8,706, హైదరాబాద్ రూ. 8,706, కేరళలో రూ. 8,706, పూణేలో రూ. 8,706, బరోడా లో రూ. 8,711, అహ్మదాబాద్ లో 8,711లకు చేరింది. 24 క్యారెట్ గ్రాముకు నిన్నటితో పోల్చితే రూ.39 పెరిగింది. 100 గ్రాములకు 3900 మేరకు చేరుకుంది.

అంతర్జాతీయ ప్రభావం:
అంతర్జాతీయ విపణిలోనూ స్పాట్‌గోల్డ్‌ ఔన్సు 2900 డాలర్ల మార్కు దాటంది. అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం, స్టీల్‌పై 25 శాతం సుంకం విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొనడం పసిడి డిమాండ్‌ ఒక్కసారి ఊపందుకోవడానికి కారణమైందని నిపుణలు పేర్కొంటున్నారు. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఏప్రిల్‌ నెల డెలివరీ పసిడి కాంట్రాక్ట్‌ రూ.940 మేర పెరిగి రూ.85,828కి చేరింది.

బంగారం పెట్టుబడికి మంచిదా?
బంగారం పెట్టుబడికి మంచిదా కాదా అనేది మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు , పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది . ఇది ద్రవ్యోల్బణం నుండి రక్షణను అందిస్తుంది. అయితే, బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతాయని గ్యారెంటీ లేదు. కాబట్టి, బంగారం పెట్టుబడి చేసే ముందు, మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+