రూ.3,00,000 వరకు భారీ తగ్గింపు: మార్కెట్లో దుమ్ము రేపుతున్న 5 కార్లు ఇవే!!

Diwali Best Offers: ఫెస్టివల్ సీజన్ కార్ల కంపెనీలకు అత్యంత కీలకమైన సమయం. ఈ సీజన్లో విక్రయాలను పెంచడానికి, కంపెనీలు కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈ ఏడాది దీపావళి సందర్భంగా కూడా అనేక కార్ల కంపెనీలు భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. కొన్నికార్లపై ఏకంగా రూ.3 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ దీపావళికి మీరు కొత్త కారు కొనాలనుకుంటే ఈ 5 కార్లపై లభిస్తున్న భారీ డిస్కౌంట్ల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

1. మహీంద్ర మరాజ్జో(Mahindra Marazzo)
ఈ దీపావళికి ఈ కారుపై రూ.3 లక్షల వరకు అత్యధిక తగ్గింపు లభిస్తోంది. ఇది మల్టీ పర్పస్ వెహికల్ సెగ్మెంట్‌లో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణానికి అద్భుతమైన ఫీచర్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఏడు లేదా 8 మంది సీటింగ్ సామర్థ్యం గల పెద్ద కారు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.06 లక్షల నుంచి రూ. 16.38 లక్షల వరకు ఉంది.

Top 5 Cars with Up to Rs 3 Lakh Diwali Discount Don t Miss These Festive Deals

2. స్కోడా కుషాక్ (Skoda Kushaq)
ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీపై దీపావళి డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు.స్కోడాకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఇది ఒకటి. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా, ఇది కఠినమైన రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించగలదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.61 లక్షల నుంచి రూ. 18.43 లక్షల మధ్య ఉంది.

3. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400)
ఎలక్ట్రిక్ కారు (EV) కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఈ దీపావళికి దీనిపై రూ. 2.5 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఆకట్టుకునే లుక్, డిజైన్, అద్భుతమైన ఇంటీరియర్, మంచి రేంజ్ కారణంగా ఇది మార్కెట్‌లో ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. ఈ తగ్గింపుతో ఇది మరింత సరసమైన ధరలో లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 17.69 లక్షల వరకు ఉంది.

4. స్కోడా స్లావియా (Skoda Slavia)
స్కోడా నుంచి మరొక కారు స్లావియాపై రూ. 2.25 లక్షల వరకు మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది.ఇది ఒక ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ కారు. స్టైల్, సౌకర్యం, విశాలమైన క్యాబిన్, అద్భుతమైన ఇంటీరియర్, పెద్ద బూట్ స్పేస్ దీని ప్రత్యేకతలు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 17.70 లక్షల వరకు ఉంది.

5. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara)
తక్కువ ధరలో కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనాలనుకునేవారికి మారుతి సుజుకి గ్రాండ్ విటారా మంచి ఎంపిక. ఈ దీపావళి పండుగ సందర్భంగా దీనిపై రూ. 1.8 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అద్భుతమైన ఇంటీరియర్, ఫీచర్ల కారణంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఇది అత్యంత ప్రసిద్ధి చెందింది. అలాగే కంపెనీ అత్యధికంగా అమ్ముతున్న కార్లలో ఇది ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.77 లక్షల నుంచి రూ. 19.72 లక్షల వరకు ఉంది. ఈ దీపావళి డిస్కౌంట్ ఆఫర్లను ఉపయోగించుకుని మీరు కూడా మీ కలల కారును తక్కువ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+