బంగారంపై రూ. 20,000 కోట్ల బిజినెస్

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు చిగురించడం, లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-ఇరాన్ తదుపరి సమావేశంపై చేసిన ప్రకటనలు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల భయాలను తగ్గించింది. దీని ప్రభావంతో బంగారం రేట్లు నేడు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 0.91 శాతం పెరిగింది.

బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, ఈ ఏడాది వ్యాపారం రూ. 20,000 కోట్లను అధిగమిస్తుందని గోల్డ్ జ్యువెలరీ ఫెడరేషన్ తెలిపింది. గత ఏడాది అంచనా వేసిన రూ. 16,000 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఇది అధికం. బులియన్ ధరలు అనూహ్య గరిష్ట స్థాయిలకు చేరాయి. వినియోగదారులు ప్రస్తుతం తక్కువ బరువున్న ఆభరణాలు, వెండి, వజ్రాల ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్‌లకు కూడా ఆదరణ పెరుగుతోంది.

Trade Expected to Surpass Rs 20000 Crore as Indians Embrace Lightweight Jewellery Amid High Prices

గత ఏడాది 10 గ్రాముల బంగారం రూ. 1,00,000 నుండి రూ. 1.58 లక్షలకు పెరిగింది. కిలో వెండి రూ. 85,000 నుండి రూ. 2.55 లక్షలకు చేరుకుంది. ఈ ధరల పెరుగుదల డిమాండ్‌ను తగ్గించట్లేదు. పైగా మరింత అధికం చేస్తోంది. బంగారాన్ని పెట్టుబడులకు సేఫ్ హెవెన్ గా భావించడమే దీనికి ప్రధాన కారణం. తక్కువ బరువున్న ఆభరణాలు, చిన్న నాణేల ప్రజాదరణ భారీగా పెరుగుతోంది కూడా.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,666, 22 క్యారెట్లు - రూ. 14,360, 18 క్యారెట్లు - రూ. 11,980

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+