ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరిక: భారత్‌తో సహా ఇతర దేశాలపై గురి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌తో సహా ఇతర దేశాలపై విరుచుకుపడ్డారు. అధిక సుంకాల విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతులు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఇతర దేశాలు దశాబ్దాలుగా మనపై టారిఫ్‌లను వేస్తున్నాయని.. ఇప్పుడు ఆ దేశాలపై మనం వాటిని ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఏప్రిల్ 2 నుండి "పరస్పర పన్నువిధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ట్రంప్ ప్రధానంగా ఆటోమొబైల్ రంగంపై దృష్టి సారించారు.
ట్రంప్ ఆగ్రహానికి కారణం ఏమిటి?
ట్రంప్ తన ప్రసంగంలో యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారతదేశం, మెక్సికో, కెనడా వంటి దేశాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఈ దేశాలన్నీ అమెరికా కంటే చాలా ఎక్కువ సుంకాలను వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అమెరికన్ కార్లు, మోటార్‌సైకిళ్లపై భారతదేశం 100 శాతానికి పైగా సుంకాలు విధిస్తోందని, ఇది అమెరికన్ కంపెనీలకు అన్యాయమని ట్రంప్ అన్నారు "వారు మాపై ఎంత పన్ను విధిస్తే, మేము వారిపై అంతే పన్ను విధిస్తాము" అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, భారతదేశం మానిటీయేతర అవరోధాలను ఉపయోగించి అమెరికన్ ఉత్పత్తులను తమ మార్కెట్లోకి రాకుండా చేస్తే, అమెరికా కూడా అదే విధానాన్ని అవలంబిస్తుందని హెచ్చరించారు.

భారతీయ పరిశ్రమ ఆశలు అడియాసలేనా?
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని, అమెరికన్ ఉత్పత్తులకు మార్కెట్ ప్రవేశం కల్పించడం ద్వారా అధిక సుంకాల నుండి ఉపశమనం పొందాలని భారతీయ పరిశ్రమ భావించింది. అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఈ ఆశలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ చర్చలు ప్రారంభం కావడానికి ముందే భారతదేశం బోర్బన్ విస్కీ వంటి అనేక వస్తువులపై సుంకాలను తగ్గించడం గమనార్హం.
మరో వైపు పరస్పర సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ట్రంప్ యొక్క సుంకాల ప్రణాళికను అమలు చేసే బాధ్యతను స్వీకరించిన కొత్త యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) జామిసన్ గ్రీర్‌తో ఆయన సమావేశమయ్యారు.
ట్రంప్ మాటల్లో 'అన్యాయం'
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం
కాంగ్రెస్‌లో ప్రసంగిస్తూ, ఇతర దేశాలు చాలా సంవత్సరాలుగా అమెరికాపై సుంకాలు విధించాయని, ఇప్పుడు అమెరికా ఆ దేశాలపై సుంకాలను ఉపయోగించాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ అన్నారు. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారతదేశం వంటి దేశాలు అమెరికాపై అధిక సుంకాలు విధిస్తున్నాయని, ఇది "అన్యాయం" అని ఆయన పేర్కొన్నారు. పరస్పర సుంకాల విధానం అమల్లోకి వస్తే, దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పకపోవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications