బైక్ కంటే బెస్ట్ ఛాయిస్? 61 కిలోమీటర్ల మైలేజ్..తక్కువ ధరలోనే.. TVS సర్‌ప్రైజ్!

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో విశేష ప్రజాదరణ పొందిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కొత్త అవతారంలో ముస్తాబైంది. టీవీఎస్ మోటార్ కంపెనీ జూపిటర్ సిరీస్‌లో 'డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ శ్రేణి'ని అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. 110సీసీ సెగ్మెంట్లో వస్తున్న ఈ కొత్త స్కూటర్‌లో ఆకట్టుకునే డ్యూయల్-టోన్ రంగులతో పాటు అనేక ఆధునిక ఫీచర్లను కంపెనీ జతచేసింది.

రోడ్డు ప్రమాదాలకు చెక్: ఇకపై వాహనాలే మాట్లాడుకుంటాయి!
రోడ్డు ప్రమాదాలకు చెక్: ఇకపై వాహనాలే మాట్లాడుకుంటాయి!

ధర, రంగుల ఎంపిక
కొత్త టీవీఎస్ జూపిటర్ డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ శ్రేణి ప్రారంభ ధర రూ.89,825(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ స్కూటర్ స్పెక్ట్రల్ బ్లూ, స్పెక్ట్రల్ కాపర్ అనే రెండు ప్రత్యేక డ్యూయల్-టోన్ రంగుల్లో లభిస్తుంది. కాంతి పడే కోణాన్ని బట్టి రంగులు మారేలా దీని ప్యానెల్స్‌ను డిజైన్ చేశారు. లోపలి ప్యానెళ్లు, సవరించిన సీటు ఫినిషింగ్, పాక్షిక క్రోమ్ అద్ధాలతో వస్తున్న ఈ మోడల్, 110సీసీ సెగ్మెంట్లో ఇటువంటి స్పెక్ట్రల్ రంగులను కలిగి ఉన్న మొట్టమొదటి స్కూటర్‌గా నిలిచింది.

TVS Jupiter Dual-Tone Spectral Launched Check Price 61 Kmpl Mileage and Features Full Details

ఇంజన్ సామర్థ్యం
ఈ స్కూటర్లో 113.3సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 7.9hp పవర్, 9.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 61.2 కిలోమీటర్ల వరకు మెరుగైన మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. నిత్యం ప్రయాణాలు చేసే కస్టమర్లకు ఇది మైలేజ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉపయోగపడనుంది.

సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు
డిజైన్ పరంగా ఈ స్కూటర్లో ప్రధాన ఆకర్షణ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు. ఈ సెగ్మెంట్లో ఈ ఫీచర్ రావడం ఇదే తొలిసారి. సాధారణ ఇండికేటర్లలా మినుకుమినుకుమనే బదులు ఇవి ప్రీమియం కార్లలో ఉన్నట్లు క్రమ పద్ధతిలో వెలుగుతూ స్కూటర్ కు మోడరన్ అండ్ ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

మనుషులు లేని సినిమా! ఏఐ సంచలనం
మనుషులు లేని సినిమా! ఏఐ సంచలనం

రైడింగ్ కంఫర్ట్, అదనపు ఫీచర్లు
రైడర్, వెనుక కూర్చునేవారి ఇద్దరి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దదైన ప్రీమియం లాంగ్ సీట్‌ను, బ్యాక్ సపోర్ట్‌ను అందించారు. సీటు కింద 33 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ కలదు. ఇందులో రెండు హెల్మెట్లను సులభంగా ఉంచుకోవచ్చు. దీనితో పాటు ప్రయాణంలో ఫోన్ ఛార్జింగ్ కోసం USB టైప్-సీ పోర్ట్, నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లను డిస్‌ప్లేపై చూపే టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. జులై నెలలోనే దాదాపు 1.48 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించిన టీవీఎస్ జూపిటర్.. ఈ కొత్త డ్యూయల్-టోన్ వేరియంట్ రాకతో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+