Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UBER: ఆ బడా కంపెనీతో ఊబర్ సంస్థ ఒప్పందం..డీల్ మామూలుగా లేదుగా..!!

ప్రముఖ రైడ్-హెయిలింగ్ సంస్థ Uber, పర్యావరణ పరిరక్షణ దిశగా భారీ ముందడుగు వేసింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని విస్తరించేందుకు Refex Green Mobilityతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 2026 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 1,000 ఎలక్ట్రిక్ వాహనాలను తమ ఫ్లాట్‌ఫారమ్‌పై అందుబాటులోకి తీసుకురానున్నట్లు Uber ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి పూర్తిగా ఉద్గార రహిత ప్రయాణాలను అందించాలనే లక్ష్యంతో Uber ఈ భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టింది. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలనే Uber యొక్క నిరంతర ప్రయత్నాలకు ఈ ఒప్పందం మరింత ఊతమిస్తుంది. కొత్తగా చేర్చబడే 1,000 ఎలక్ట్రిక్ వాహనాలు, నగరాల్లో స్థిరమైన రవాణా ఎంపికలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

uber-partners-with-refex-green-mobility-to-roll-out-1-000-evs-by-2026

తొలిదశలో ఈ నగరాల్లో..
చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న Refex Industries Limited అనుబంధ సంస్థ అయిన Refex Green Mobility, 'Refex eVeelz' బ్రాండ్‌ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా తొలి దశలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో ఊబెర్ సేవల్లో ఎలక్ట్రిక్ కార్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.తద్వారా పట్టణ రవాణా వ్యవస్థను విద్యుదీకరించేందుకు Uber చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక మైలురాయిగా నిలువనుంది.

ఈ సందర్భంగా Uber ఇండియా దక్షిణాసియా హెడ్, సప్లై ఎలక్ట్రిఫికేషన్, ఆదిత్య కపూర్ మాట్లాడుతూ- భారతదేశంలో ఉద్గారాలు లేని రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి ఊబెర్ కట్టుబడి ఉందన్నారు. Refex eVeelzతో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం ఆ దిశగా వేసిన బలమైన అడుగుగా చెప్పుకొచ్చారు. పట్టణ రవాణాను విద్యుదీకరించే తమ ప్రయత్నాలకు ఇది మరింత బలాన్నిస్తుందని వెల్లడించారు.భారతదేశంలోని అనేక నగరాల్లో ప్రయాణికులకు ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించే అవకాశాలు పెరుగుతాయన్నారు.పర్యావరణ హితమైన భవిష్యత్తు కోసం EV వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి తాము కృషి చేస్తామని తెలిపారు.

Refex గ్రూప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సచిన్ నవ్తోష్ ఝా మాట్లాడుతూ, "పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే మా నిబద్ధతకు అనుగుణంగా Uberతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలోని మరిన్ని నగరాలకు ఎలక్ట్రిక్ రవాణా సేవలను విస్తరించడానికి ఈ సహకారం దోహదపడుతుంది. ఇప్పటికే B2B, B2C విభాగాల్లో దాదాపు 1,300 కంపెనీ యాజమాన్యంలోని 4-వీలర్ EVలతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాము. ఈ కొత్త భాగస్వామ్యం నగరాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో మరియు భారతదేశం యొక్క స్థిరత్వ లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది." అని అన్నారు.

ఇప్పటికే ఊబర్ గ్రీన్ సేవలు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా Uber ఇప్పటికే Uber Green సేవలను ఢిల్లీ, ముంబై, బెంగళూరు మరియు కోల్‌కతా నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. Uber Green ద్వారా ప్రయాణికులు యాప్‌లో కేవలం కొన్ని క్లిక్‌లతో ఎలక్ట్రిక్ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో 100 నగరాల్లో Uber Green సేవలు అందుబాటులో ఉన్నాయి.Uber ఇంకా Refex eVeelz సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడంలో కీలక మైలురాయిగా నిలువనుంది. తద్వారా దేశంలో హరిత ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థకు మార్గం సుగమం కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+