రోడ్డెక్కిన మారుతి సుజుకి ఫేవరెట్ ఎస్‌యూవీ- రేట్.. ఫీచర్స్ ఎక్సెట్రా!!

దేశీయ మార్కెట్లోకి కొత్తగా మారుతి సుజుకి విక్టోరిస్ ఎస్‌యూవీ అడుగు పెట్టింది. బ్రెజ్జా కంటే హైఎండ్ మోడల్ ఇది. Got it All అనేది దీని ట్యాగ్‌లైన్‌. త్వరలోనే ఈ కారుకు సంబంధించిన ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. దసరా నాటికి ఆర్డర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రైస్ రేంజ్ కూడా అప్పుడే వెలువడుతుంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మిగిలిన కంపెనీలకు ఇది తీవ్ర పోటీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీని ధర రూ. 12 లక్షల వరకు ఉండొచ్చు.

సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యత..

విక్టోరిస్ ఎస్‌యూవీలో సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యత ఇచ్చింది మారుతి సుజుకి. తనదైన ముద్ర వేసింది. బీఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. దేశీయ మార్కెట్ లో తొలిసారిగా లెవల్-2 ఏడీఏఎస్ ఫీచర్‌ను ఈ విక్టోరిస్ ఎస్‌యూవీతోనే ఆరంభించింది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అధునాతన ఏడీఏఎస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Unveiling the Maruti Suzuki Victoris The Ultimate 5-Star Mid-Size SUV with Advanced Safety Features

డిజైన్ పరంగా..

డిస్క్ బ్రేక్‌ సిస్టమ్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఈ కారు ప్రత్యేకత. డిజైన్ పరంగా- విక్టోరిస్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ-విటారాను తలపించేలా దీని ముందు భాగం మిక్స్డ్ కలర్ తో విభిన్నంగా ఉంటుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ తో కూడిన క్రోమ్ రిబ్బన్‌తో లింకప్ చేశారు. బంపర్‌లో కొంచెం ఎత్తులో ఫాగ్ లైట్స్ అమర్చారు. 17-అంగుళాల ఏరో-కట్ అల్లాయ్ వీల్స్ టర్బైన్ వంటి డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్..

వెనుక భాగంలో- కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్కాటర్డ్ గ్లో ప్యాటర్న్‌ లో డిజైన్ చేశారు. ఇది మరే ఇతర మారుతి మోడల్‌లోనూ కనిపించదు. ఈ కారు పొడవు- 4,360, వెడల్పు- 1,655, ఎత్తు- 1,795 మిల్లీ మీటర్లు. వీల్‌బేస్ 2,600 ఎంఎం. ఈ ఎస్‌యూవీ మొత్తం 10 కలర్ వేరియంట్ లల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో డ్యూయల్ టోన్- 3, మోనోటోన్- 7. ఇందులో మిస్టిక్ గ్రీన్, ఎటర్నల్ బ్లూ అనే రెండు కొత్త రంగులు ఉన్నాయి.

ఇంటీరియర్ డిజైన్

మారుతి సుజుకి విక్టోరిస్ ఇంటీరియర్ డిజైన్ ఆకర్షణీయంగా కనిపించింది. 3-లేయర్ డ్యాష్‌బోర్డ్, బ్లాక్ అండ్ ఐవరీ డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ దీని ప్రత్యేకత. సాఫ్ట్ టచ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ ఉంటుంది. టెక్స్‌చర్డ్ సీటు అప్‌ హోల్స్టరీ, పియానో ​​బ్లాక్ యాక్సెంట్‌.. ప్రీమియం కారులో ఉన్నామనే అనుభూతిని ఇస్తాయి. సీఎన్‌జీ సిలిండర్‌ను ఫ్లోర్ కిందకు మార్చడం వల్ల ఎస్ సీఎన్‌జీ వేరియంట్‌లోనూ బూట్ స్పేస్ మెరుగ్గా ఉంటుంది.

ఫీచర్ల విషయానికి వస్తే..

విక్టోరిస్ 10.1-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో-ఎక్స్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 8-స్పీకర్ ఇన్‌ఫినిటీ సౌండ్ సిస్టమ్‌తో 5.1 ఛానెల్ డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది మారుతి సుజుకి కారులో మొదటిసారి.

ఆకట్టుకునే కలర్స్..

హ్యుందాయ్ క్రెటాకు పోటీగా- ఇందులో 64 కలర్ యాంబియంట్ లైటింగ్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ కూడా ఉన్నాయి. ఇతర ఫీచర్లలో హ్యాండ్స్-ఫ్రీ గెస్చర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌ గేట్, 8-వే పవర్డ్ డ్రైవ్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

రెండు పవర్‌ ట్రెయిన్ వేరియంట్స్

ఈ మోడల్ లో రెండు పవర్‌ ట్రెయిన్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ మోటార్, 1.5 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్. 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 103 హెచ్‌పీని కలిగివుంది. 139 ఎన్ఎమ్ మాగ్జిమమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 5-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీ అనే రెండు ట్రాన్స్‌మిషన్ వేరియంట్ లు ఇందులో ఉంటాయి. ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్ కూడా అందుబాటులో ఉంది.

1.5 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ గ్రాండ్ విటారా తరహాలో రూపుదిద్దుకుంది. ఇది 92.5 హెచ్‌పీ పవర్, 122 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ-సీవీటి గేర్‌బాక్స్‌తో లింకప్ అయింది.

మైలేజీ ఫర్లేదు.

1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ మోటార్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 21.18, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ 21.06 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఏడబ్ల్యూడీ ఫార్మాట్‌లో 19.07, సీఎన్‌జీ వేరియంట్లు 27.02 కిలోమీటర్ మైలేజీని అందిస్తాయి. స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లు 28.65 కి.మీ మైలేజీని అందిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+