US Dollar: అమాంతం పెరిగిన డాలర్ విలువ! యూరో పతనం. కారణాలేంటి?
అమెరికా డాలర్ అంతర్జాతీయ మార్కెట్‌లో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా బాండ్ మార్కెట్‌లో చోటు చేసుకున్న భారీ కుదుపులు, పెరిగిన ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడింది. ప్రధాన దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ ఏకంగా 17 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. గత మూడు వారాలుగా నిలకడగా లాభాలను ఆర్జిస్తున్న డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 102.08 వద్ద ట్రేడవుతోంది. ఈ వారం ఒక్కసారే సుమారు 1 శాతం మేర వృద్ధిని సాధించే దిశగా దూసుకెళ్తోంది. గతంలో మే 2025లో మాత్రమే ఇలా వరుసగా మూడు వారాల పాటు డాలర్ బలపడిన దాఖలాలు ఉన్నాయి.
అమెరికాలో ట్రెజరీ బాండ్ల అమ్మకాలు భారీగా పెరగడంతో బాండ్ ఈల్డ్స్ ఒక్కసారిగా ఎగబాకాయి. 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ ఏకంగా 5.344 శాతానికి చేరి, 2002 తర్వాత అత్యధిక స్థాయిని తాకాయి. చమురు ధరలు భగ్గుమంటుండటం, ప్రభుత్వాల భారీ రుణాలు, బాండ్ల సరఫరా పెరగడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాలకంటే కూడా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు , ద్రవ్య పరమైన నష్టభయాలే బాండ్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పాతాళానికి పడిపోయిన యూరో!
అమెరికా డాలర్ దూసుకుపోవడానికి ప్రధాన కారణం కేవలం యూఎస్ ఆర్థిక బలం మాత్రమే కాదు.. యూరప్ దేశాలను వేధిస్తున్న సమస్యలు కూడా ప్రధాన కారణమే. ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న ఆందోళనల కారణంగా యూరో కరెన్సీ విలువ $1.1237 వద్ద ట్రేడవుతూ, మే 2025 నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది. మరోవైపు మిడిల్ ఈ్రాట్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం, యూరప్‌లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితి యూరో కరెన్సీని తీవ్రంగా దెబ్బతీశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక్కటే బలపడటం కంటే, యూరప్ దేశాల్లోని సమస్యలే డాలర్‌కు తిరుగులేని బలమైన మార్గాన్ని ఏర్పరుస్తున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యూఎస్ జాబ్స్ డేటాపైనే అందరి చూపు
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంపై మదుపరులు తీవ్రంగా చర్చిస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో ఈ నెలలో ఫెడ్ రేట్ల పెంపు ఉండకపోవచ్చని ట్రేడర్లు భావిస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం విడుదల కానున్న అమెరికా పేరోల్ నివేదికపై మార్కెట్ వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఉద్యోగాల వృద్ధి మందగించి ఉంటుందని, నిరుద్యోగ రేటు మాత్రం వరుసగా మూడో నెల కూడా 4.1 శాతాన్నే తాకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కనుక అంచనాలను తలకిందులు చేస్తే అమెరికా వడ్డీ రేట్లు, బాండ్లు , డాలర్ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
పసిడి ధరలు, ఇతర కరెన్సీల పరిస్థితి ఏమిటి?
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటింది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు నిలిచిపోవడం ఇంధన ధరల పెరుగుదలకు కారణమైంది. మరోవైపు టోక్యోలో కోర్ ద్రవ్యోల్బణం 10 నెలల గరిష్టానికి చేరడంతో జపాన్ యెన్ 158 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బ్రిటిష్ పౌండ్ $1.3187 వద్ద, ఆస్ట్రేలియా డాలర్ $0.6918 వద్ద తమ మూడు నెలల కనిష్ట స్థాయిల వద్దే కదలాడుతున్నాయి. యూరప్‌లో తలెత్తిన సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటంతో డాలర్ , యెన్ కరెన్సీలు మరింత బలపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.














Click it and Unblock the Notifications
