అమెరికా-రష్యా సీక్రెట్ డీల్? ఒక్క రాత్రిలో కుప్పకూలిన బంగారం, వెండి ధరలు!

అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉండే అమెరికా, రష్యాలు ఓ రహస్య ఆర్థిక ఒప్పందానికి సిద్ధమవుతున్నాయన్న బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కుదిరినట్లుగా భావిస్తున్న ఈ ఒప్పందం వార్త బయటకు రావడంతోనే అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ఇది కేవలం రాజకీయ మార్పే కాకుండా.. ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చేసే పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.

డాలర్ పునరాగమనం, ఆర్థిక భాగస్వామ్యం
ఈ రహస్య ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం రష్యా తిరిగి అమెరికా డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలోకి రావడమే. 2022లో ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను 'స్విఫ్ట్' వ్యవస్థ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే తాజా డీల్ ప్రకారం రష్యా తన చమురు, సహజ వాయువు, ఇతర కీలక ముడి సరుకుల వాణిజ్యాన్ని మళ్లీ డాలర్లలోనే నిర్వహించడానికి మొగ్గు చూపుతోంది. శిలాజ ఇంధనాలతో సహా మొత్తం ఏడు కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని సమాచారం. దీనివల్ల ప్రపంచంలోని ఇద్దరు అతిపెద్ద ఇంధన దిగ్గజాలు శత్రువుల నుంచి భాగస్వాములుగా మారే అవకాశం ఉంది.

US-Russia Secret Deal Gold and Silver Prices Crash Russia Returns to Dollar Settlement System

బంగారం, వెండి ధరల్లో భారీ పతనం
ఈ సీక్రెట్ డీల్ వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా యుద్ధాలు లేదా ఆర్థిక అస్థిరత ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడు అమెరికా-రష్యా మధ్య సయోధ్య కుదురుతుందన్న వార్తలతో బంగారం, వెండి ధరల్లో భారీ అమ్మకాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం 4 శాతం తగ్గగా.. వెండి 8 శాతానికి పైగా పడిపోయింది. ఈ ప్రభావం భారత మార్కెట్‌పై కూడా తీవ్రంగా పడింది. ఎంసీఎక్స్‌ (MCX)లో వెండి ధర కేవలం ఒకే రాత్రిలో రూ. 26,000 కుప్పకూలగా.. బంగారం ధర రూ. 6,000 కు పైగా పతనమైంది. ధరలు వేగంగా పడిపోవడంతో వెండి మార్కెట్‌లో రెండుసార్లు లోయర్ సర్క్యూట్ విధించాల్సి వచ్చింది.

భారత్-రష్యా వాణిజ్యంపై నీలినీడలు
రష్యా తిరిగి డాలర్ వైపు మొగ్గు చూపడం భారత్ వంటి దేశాలకు కొంత ఆందోళన కలిగించే విషయమే. ప్రస్తుతం రష్యా తన విదేశీ వ్యాపారంలో 90 శాతాన్ని భారత్, చైనాలతో స్థానిక కరెన్సీల (రూపాయి-రూబుల్) ద్వారానే నిర్వహిస్తోంది. బ్రిక్స్ దేశాల మధ్య స్థానిక కరెన్సీ లావాదేవీలు పెరుగుతున్న తరుణంలో, రష్యా మళ్లీ డాలర్ వ్యవస్థలోకి వెళ్లడం వల్ల డాలర్ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రూపాయి విలువ, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిపుణుల హెచ్చరిక
ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న ఈ గందరగోళం తాత్కాలికమా లేక దీర్ఘకాలం కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. అమెరికా డాలర్ బలోపేతం కావడం వల్ల ఇతర కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతుందని, అలాగే బంగారం విలువ మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, ఈ రెండు దేశాల మధ్య అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడటం ఉత్తమమని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+