Valentine's Day 2026: ఓయో రికార్డ్. హోటల్ బుకింగ్స్ ఫుల్!

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ జంటలు విలాసవంతమైన , విహారయాత్రల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి హోటల్ బుకింగ్‌లు, ట్రావెల్ ప్లాన్‌లు గణనీయంగా పెరిగాయని వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా, వీకెండ్ మొత్తం గడిపేలా 'డెస్టినేషన్ స్టైల్' ట్రిప్పులకు జంటలు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రముఖ ట్రావెల్ సంస్థ క్లియర్‌ట్రిప్ ప్రకారం, హోటల్ బుకింగ్‌లలో ఏకంగా 175% వృద్ధి నమోదైంది. పర్యాటకులు కేవలం స్థానిక ప్రాంతాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ గమ్యస్థానాలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. గౌహతికి బుకింగ్‌లు 60% పెరగ్గా, కొలంబోకు వెళ్లే వారి సంఖ్య 65% పెరగడం విశేషం. రేట్‌ గెయిన్ నివేదిక ప్రకారం, హోటల్ బుకింగ్‌లు గత ఏడాదితో పోలిస్తే 58% మేర పెరిగాయి.

Valentine s Day

Valentine's Day కోసం ఎంతైనా ఖర్చు

ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, జంటలు కేవలం గదిని బుక్ చేసుకోవడమే కాకుండా.. తమ కోసం ప్రత్యేకంగా రూపొందించిన (Tailor-made) సేవలను కోరుకుంటున్నారు. అరైయా హోటల్స్ సీఈఓ అమృదా నాయర్ మాట్లాడుతూ, బుకింగ్‌లు 110% వరకు పెరిగాయని, ప్రైవేట్ డైనింగ్, ప్రపోజల్ సెటప్‌ల వంటి క్యూరేటెడ్ అనుభవాల కోసం జంటలు ఆరాటపడుతున్నారని తెలిపారు.

మిహిర్ గఢ్ డైరెక్టర్ అవిజిత్ సింగ్ సమాచారం ప్రకారం, గదుల సంఖ్య తక్కువగా ఉన్నా, ఒక్కో జంట చేసే సగటు ఖర్చు 30% పెరిగింది. షికార్ డిన్నర్‌లు, రోజ్ పెటల్ బాత్‌లు వంటి ప్రత్యేకతలను అతిథులు ఎక్కువగా కోరుకుంటున్నారు.

కిక్కిరిసిపోతున్న పర్యాటక ప్రాంతాలు

గోవా, జిమ్ కార్బెట్, ముక్తేశ్వర్ వంటి పర్యాటక ప్రాంతాల్లోని రిసార్ట్‌లకు డిమాండ్ 70-80% పెరిగింది. లీజర్ హోటల్స్ గ్రూప్ ఈ ఏడాది 80% పైగా ఆక్యుపెన్సీని అంచనా వేస్తోంది. గది ధరలు 10% పెరిగినప్పటికీ, నాణ్యమైన సేవలు మరియు ప్రశాంతమైన వాతావరణం కోసం పర్యాటకులు వెనకాడటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ పర్యటనలపై మక్కువ

పిక్ యువర్ ట్రైల్ నివేదిక ప్రకారం, అంతర్జాతీయ ప్రయాణ బడ్జెట్‌లు 20% నుండి 33% వరకు పెరిగాయి. మొదటిసారి విదేశాలకు వెళ్లే వాలెంటైన్స్ డే యాత్రికుల సంఖ్య 7% పెరిగింది. మహమ్మారి తర్వాత ప్రయాణాలు, వెల్‌నెస్ మరియు అర్థవంతమైన విరామ సమయాల కోసం ఖర్చు చేసే ధోరణి భారతీయుల్లో బాగా పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+