Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త: రూ.999లకే 4జీ స్మార్ట్‌ఫోన్, బంపర్ ఆఫరిచ్చిన వొడాఫోన్, ఫ్లిప్‌కార్ట్

న్యూఢిల్లీ: రూ.999లకే 4జీ స్మార్ట్‌ఫోన్ ను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్డ్‌ను భాగస్వామ్యంతో కుదుర్చుకొంది. వొడాఫోన్, ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంలో భాగంగా అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది.

ఈ కామర్స్ కంపెనీల మధ్య పోటీ కారణంగానే వినియోగదారులకు తక్కువ ధరకే మొబైల్స్‌ను, ఇతర గాడ్జెట్స్‌ను అందించనున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు ఆఫర్లతో ఈ కామర్స్ సంస్థలు ముందుకు వస్తున్నాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పోటీలు పడి ఆఫర్లను ఇస్తున్నాయి. ఈ తరుణంలోనే వొడాఫోన్, ఫ్లిప్‌కార్డ్ కంపెనీలు ఒప్పందంతో చౌకగానే 4జీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందనుంది.

 రూ. 999లకే 4జీ స్మార్ట్ పోన్

రూ. 999లకే 4జీ స్మార్ట్ పోన్

వొడాఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగానే రూ. 999 లకే 4జీ స్మార్ట్ ఫోన్ ను అందించనున్నట్టు ప్రకటించాయి. . ఈ స్కీమ్‌ కొత్త, పాత వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తోందని ప్రకటించారు.

మార్చి 31వరకు మాత్రమే ఆఫర్

మార్చి 31వరకు మాత్రమే ఆఫర్

2018 మార్చి 31వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రెండు కంపెనీలు ప్రకటించాయి. ఈ స్పెషల్‌ ధరను అందిపుచ్చుకోవడానికి కస్టమర్లు ప్రతి నెలా కనీసం 150 రూపాయల రీఛార్జ్‌ను 36 నెలల పాటు చేయించుకోవాలని వొడాఫోన్ ప్రకటించింది.

18 నెలల తర్వాత రూ.900 క్యాష్ బ్యాక్ ఆఫర్

18 నెలల తర్వాత రూ.900 క్యాష్ బ్యాక్ ఆఫర్

నెల ఆఖరులో కనీసం 150 రూపాయలు రీఛార్జ్‌ అయి ఉండాలి. దీంతో 18 నెలల అనంతరం కస్టమర్లకు 900 రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. మరో 18 నెలల అనంతరం 1,100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు పొందనున్నారు. మొత్తంగా 2వేల రూపాయల మేర క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ కస్టమర్ల వొడాఫోన్‌ ఎం-పైసా వాలెట్లలో క్రెడిట్‌ అవుతాయి.

 ఇతర మొబైల్స్‌కు కూడ వొడాఫోన్ ఆఫర్లు

ఇతర మొబైల్స్‌కు కూడ వొడాఫోన్ ఆఫర్లు

మైక్రోమ్యాక్స్‌, ఐవోమి, యు మొబైల్స్‌, ఇంటెక్స్‌, స్వైప్‌, ఆల్కాటెల్‌ వంటి పలు బ్రాండుల స్మార్ట్‌ఫోన్లకు వొడాఫోన్‌ క్యాష్‌బ్యాక్‌ను ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అందిస్తోంది. రిలయన్స్‌ జియోను ఎదుర్కోవడానికి వొడాఫోన్‌ వేసిన ఎత్తుగడలో ఇదీ ఒకటి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+