మంచి మైలేజీ కావాలా? ఈ చిట్కాలు పాటిస్తే డబ్బు, సమయం రెండూ ఆదా!

ప్రతి ఒక్కరూ తమ కారు ఎక్కువ మైలేజీ ఇవ్వాలని, తద్వారా ఇంధన ఖర్చులు తగ్గాలని కోరుకుంటారు. కానీ తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల కారు మైలేజీ తగ్గి అనవసరంగా పెట్రోల్ ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో కారు మైలేజీని గణనీయంగా పెంచేందుకు, డబ్బుతో పాటు మీ విలువైన సమయాన్ని కూడా ఆదా చేసేందుకు పాటించాల్సిన కొన్ని కీలక మార్గాలను తెలుసుకుందాం.

1.కారు మెయింటెనెన్స్‌పై దృష్టి పెట్టండి
కారు ఇంజిన్ సామర్థ్యం మెరుగ్గా ఉంటేనే ఇంధన వినియోగం తగ్గుతుంది. అందుకే కారు నిర్వహణ చాలా ముఖ్యం. టైర్లలో ఎప్పుడూ సరైన గాలి ప్రెషర్ ఉండేలా చూసుకోవాలి. గాలి తక్కువగా ఉంటే టైర్ రోడ్డుకు ఎక్కువగా తగులుతుంది. దీనివల్ల కారు నడపడానికి ఇంజిన్ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కారును సరైన సమయానికి సర్వీస్ చేయించడం తప్పనిసరి. మురికిగా ఉన్న ఎయిర్ ఫిల్టర్, పాడైన స్పార్క్ ప్లగ్ లేదా పాత ఇంజిన్ ఆయిల్.. ఇవన్నీ ఇంజిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి మరియు ఇంధనాన్ని ఎక్కువగా వినియోగిస్తాయి.

Want Better Mileage Follow These Simple Car Tips to Save Fuel and Time

2. వీల్ అలైన్‌మెంట్ సరిచేయండి
మీ కారు వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. మీరు కారును తిన్నగా నడుపుతున్నా అది ఎడమ వైపు లేదా కుడి వైపునకు లాగుతున్నట్లు అనిపించినా లేదా టైర్లు ఒక వైపు మాత్రమే ఎక్కువగా అరిగిపోతున్నా వీల్ అలైన్‌మెంట్ సరిగా లేదని అర్థం చేసుకోవాలి. తప్పుడు అలైన్‌మెంట్ వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. టైర్లు త్వరగా అరిగిపోతాయి. వెంటనే దాన్ని సరిచేయించండి.

3. కారు బరువును తగ్గించండి
కారు డిక్కీలో అవసరం లేని ప్రతి అదనపు వస్తువు కారు బరువును పెంచుతుంది. బరువు పెరిగితే కారును ముందుకు నడపడానికి ఇంజిన్ ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు ఇది ఇంధన వినియోగాన్ని బాగా పెంచుతుంది. కాబట్టి అవసరం లేని సామాగ్రిని డిక్కీ నుంచి తొలగించండి.

4. స్మూత్ డ్రైవింగ్ పాటించండి
మెరుగైన మైలేజీ కోసం కారును అతి వేగంగా, ఆకస్మికంగా (రాష్ డ్రైవింగ్) నడపడం మానుకోవాలి. వేగంగా యాక్సిలరేటర్ నొక్కడం, ఆకస్మికంగా బ్రేకులు వేయడం వల్ల ఫ్యుయెల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. సాధారణ వేగంతో కారు నడపడం వల్ల మెరుగైన మైలేజీ లభిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ ఉన్నప్పుడు కారు ఇంజిన్‌ను ఆపివేయండి. అనవసరంగా ఇంజిన్‌ను స్టార్ట్ చేసి ఉంచడం వల్ల ఇంధనం వృథా అవుతుంది.

5. మీ ప్రణాళికను సిద్ధం చేయండి
ట్రాఫిక్, అనవసరమైన ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోండి. ఎక్కడికైనా వెళ్లే ముందు మీ రూట్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోండి. ట్రాఫిక్ అప్‌డేట్‌లను తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ యాప్‌లను ఉపయోగించండి. ఇది ఉత్తమ మార్గాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది. భారీ ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల ఇంధనం అనవసరంగా ఖర్చు అవడమే కాక, మీ సమయం కూడా వృథా అవుతుంది. అలాగే, మీ పనులన్నింటినీ ఒకేసారి ప్లాన్ చేసుకుని, ఎక్కువ ట్రిప్‌లు వేయకుండా చూసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+