Car Insurance: సంవత్సరంలో ఎన్నిసార్లు కారు క్లెయిమ్ చేయవచ్చు

సొంతంగా కారు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో వాహనానికి చిన్నపాటి డ్యామేజ్ జరగడం సర్వసాధారణం. స్క్రాచ్ పడినా లేదా లైట్ డ్యామేజ్ అయినా వెంటనే మనకు గుర్తుకొచ్చేది 'వాహన ఇన్సూరెన్స్' క్లెయిమ్ చేయడం. కారు నష్టాలకు ఆసరాగా నిలిచేందుకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, ప్రతి చిన్న పనికీ కంపెనీని ఆశ్రయించడం ఆర్థికంగా ఏమాత్రం మంచిది కాదు. సరైన అవగాహన లేకుండా క్లెయిమ్ చేస్తే వచ్చే కొద్దిపాటి సొమ్ము కంటే.. భవిష్యత్తులో మనం కోల్పోయే లబ్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ముందు వాహనదారులు కొన్ని కీలక విషయాలను లెక్కించుకోవడం ఎంతో అవసరం.

నో క్లెయిమ్ బోనస్ (NCB) అంటే ఏంటి? అది ఎలా పోతుంది?

ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీదారులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి 'నో క్లెయిమ్ బోనస్' (NCB). ఏడాది పొడవునా ఒక్క క్లెయిమ్ కూడా చేయకుండా కారును జాగ్రత్తగా నడిపితే, తర్వాతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రిమియంపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఉదాహరణకు మీ కారు రిపేర్ ఖర్చు రూ. 15,000 అనుకుందాం. కానీ తర్వాతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యూవల్‌లో మీకు ఎన్‌సీబీ వల్ల రూ. 20,000 డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటే.. ఆ రిపేర్ ఖర్చును మీ సొంత జేబు నుంచే పెట్టుకోవడం తెలివైన పని. అదే రిపేర్ బిల్లు రూ. 50,000 దాటినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కు వెళ్లడం లాభదాయకం.

When to Claim Car Insurance How Minor Scratches Can Cost You No Claim Bonus and Raise Renewal Premiums

డిడక్టబుల్ మెలిక అర్థం చేసుకోండి!

ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే సమయంలో పాలసీదారుడే సొంతంగా కొంత సొమ్ము భరించాల్సి ఉంటుంది. దీనినే 'డిడక్టబుల్' అంటారు. పాలసీ ప్రిమియం తగ్గించుకోవడానికి చాలామంది 'వాలంటరీ డిడక్టబుల్'ను ఎక్కువగా ఎంచుకుంటారు. అంటే ఉదాహరణకు మీ రిపేర్ బిల్లు రూ. 20,000 వచ్చి, మీ వద్ద డిడక్టబుల్ రూ. 5,000 ఉంటే.. మొదటి ఐదు వేల రూపాయలు మీరే చెల్లించాలి, మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. కాబట్టి మన చేతి నుంచి ఎంత పోతోంది, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇస్తోందో క్షుణ్ణంగా లెక్కలు వేసుకున్నాకే క్లెయిమ్ ఫారమ్ నింపాలి.

ఇన్సూరెన్స్ ఏజెంట్‌తో భర్త ఎఫైర్.. 14 కోట్ల దందా బయటపడింది!
ఇన్సూరెన్స్ ఏజెంట్‌తో భర్త ఎఫైర్.. 14 కోట్ల దందా బయటపడింది!

సంవత్సరంలో ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చు?

సాధారణంగా ఓన్ డ్యామేజ్ (OD) కింద ఏడాదిలో ఇన్నిసార్లు మాత్రమే క్లెయిమ్ చేయాలనే కఠినమైన నిబంధనేమీ ఉండదు. కానీ, ఒకే సంవత్సరంలో పదే పదే క్లెయిమ్‌లు చేసుకుంటూ పోతే తర్వాతి ఏటి నుంచి మీ ఇన్సూరెన్స్ ప్రిమియం భారం విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఇంజిన్ ప్రొటెక్షన్, గేర్ బాక్స్ ప్రొటెక్షన్ వంటి కొన్ని ప్రత్యేక యాడ్-ఆన్ (Add-on) కవర్లలో ఏడాదికి ఎన్నిసార్లు సేవలు వాడుకోవచ్చో ముందే పరిమితి ఉంటుంది. కాబట్టి అత్యవసర సమయాల్లో తప్ప పదే పదే క్లెయిమ్ చేయడం మంచిది కాదు.

శృంగారంలో పాల్గొంటే ట్యాక్స్, ఇన్సూరెన్స్, పెన్షన్.. వ్యభిచారానికి చట్టబద్ధత
శృంగారంలో పాల్గొంటే ట్యాక్స్, ఇన్సూరెన్స్, పెన్షన్.. వ్యభిచారానికి చట్టబద్ధత

పాలసీ తీసుకునే ముందే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

కారుకు ఇన్సూరెన్స్ చేయించే సమయంలోనే పూర్తి రక్షణ ఇచ్చే యాడ్-ఆన్‌లను ఎంచుకోవడం చాలా కీలకం. జెరో డిప్రిసియేషన్ (Zero Dep), రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్టర్ వంటివి కారుకు పూర్తిస్థాయి రక్షణ ఇస్తాయి. అలాగే మీ కారు విలువకు తగ్గట్టుగా ఐడీవీ (Insured Declared Value) ని సమర్థవంతంగా నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా చిన్న చిన్న స్క్రాచ్‌లు, చిన్న రిపేర్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకుండా ఉండటమే మీ జేబుకు, కారు ఇన్సూరెన్స్ హిస్టరీకి ఎంతో శ్రేయస్కరం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+