కార్లకు నకిలీ సైలెన్సర్లు ఎందుకు?.. వీటి వెనుక ఇంత పెద్ద కారణముందా?

మనం రోడ్లపై వెళ్లేటప్పుడు కార్ల వెనుక బంపర్లపై మెరిసే క్రోమ్ సైలెన్సర్(నకిలీ సైలెన్సర్) పైపులను తరచుగా చూస్తూ ఉంటాం. చూడటానికి ఇవి రెండు లేదా నాలుగు నిజమైన ఎగ్జాస్ట్ పైపులలా కనిపిస్తాయి. కానీ పరిశీలించి చూస్తే వాటిలో చాలా వరకు నకిలీవి అయి ఉంటాయి. అంటే ఇవి ఇంజిన్ అంతర్గత ఎగ్జాస్ట్ సిస్టమ్ కు నేరుగా అనుసంధానించబడి ఉండవు. అసలైన ఎగ్జాస్ట్ పైపు(సైలెన్సర్) కారు అడుగుభాగంలో కిందకు వంగి దాగి ఉంటుంది. కార్ల తయారీ కంపెనీలు ఇలా నకిలీ సైలెన్సర్ డిజైన్లను ఎందుకు ఉపయోగిస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రోడ్డు ప్రమాదాలకు చెక్: ఇకపై వాహనాలే మాట్లాడుకుంటాయి!
రోడ్డు ప్రమాదాలకు చెక్: ఇకపై వాహనాలే మాట్లాడుకుంటాయి!

కారుకు స్పోర్టీ, ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడం
కారు ఇంజిన్ నిర్మాణం, ఫ్యూయల్ ట్యాంక్, సస్పెన్షన్ పొజిషన్ ఆధారంగా ఒరిజినల్ ఎగ్జాస్ట్ పైపు స్థానాన్ని ఇంజనీర్లు నిర్ణయిస్తారు. అయితే కారు వెనుక భాగం మరింత అందంగా, బ్యాలెన్స్‌డ్‌గా, స్పోర్టీ కార్లలా కనిపించడానికి డిజైనర్లు బంపర్‌పై క్రోమ్ కటౌట్లను అమరుస్తారు. ఒరిజినల్ పైపులను కదిలించకుండానే వెనుక నుంచి చూసేవారికి కారు శక్తివంతమైనదిగా కనిపించేలా ఈ నకిలీ సైలెన్సర్ టిప్స్ సహాయపడతాయి.

Why Do Cars Have Fake Exhaust Tips Safety from heat and reduce production costs Real Reasons Revealed

అధిక వేడి నుంచి రక్షణ, భద్రత
ఇంజిన్ నుంచి వెలువడే పొగ, వాయువులు అత్యంత వేడిగా ఉంటాయి. ఒకవేళ ఒరిజినల్ సైలెన్సర్ పైపు నేరుగా ఫైబర్ లేదా ప్లాస్టిక్ బంపర్‌కు తాకేలా అమర్చితే.. ఆ అధిక వేడికి ప్లాస్టిక్ బంపర్ కరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అసలైన ఎగ్జాస్ట్ పైపును బంపర్ బాడీకి దూరంగా.. కింది భాగంలో నేల వైపు చూస్తున్నట్లు అమర్చి.. బంపర్ పైన కేవలం నకిలీ సైలెన్సర్లను డిజైన్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు.

బైక్ కంటే బెస్ట్ ఛాయిస్? 61 కిలోమీటర్ల మైలేజ్..తక్కువ ధరలోనే.. TVS సర్‌ప్రైజ్!
బైక్ కంటే బెస్ట్ ఛాయిస్? 61 కిలోమీటర్ల మైలేజ్..తక్కువ ధరలోనే.. TVS సర్‌ప్రైజ్!

తయారీ ఖర్చు తగ్గించడం
నిజమైన లోహపు ఎగ్జాస్ట్ పైపులను ఇంజిన్ నుంచి బంపర్ చివరి వరకు సంక్లిష్టమైన వంపులతో డిజైన్ చేయడం, వాటిని ప్లాస్టిక్ బంపర్‌కు సురక్షితంగా జోడించడం చాలా ఖరీదైన పని. దానికి బదులుగా సాధారణ ప్లేన్ ఎగ్జాస్ట్ పైపును కారు అడుగు భాగాన ముగించి.. వెనుక బంపర్ కు చవకైన ప్లాస్టిక్ లేదా తేలికపాటి స్టీల్ నకిలీ కటౌట్లను అమర్చడం వల్ల కారు తయారీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

కారు శబ్ధంపై ప్రభావం
ఒరిజినల్ సైలెన్సర్ పైపు చివర ఉండే టిప్స్ కారు ధ్వని నాణ్యతపై ప్రభావం చూపుతాయి. సైలెన్సర్ టిప్ వెడల్పుగా, పొడవుగా ఉండే కారు ఇంజిన్ నుంచి వచ్చే శబ్ధం గంభీరంగా వినిపిస్తుంది. ఒరిజినల్ ఎగ్జాస్ట్ పైపు కొద్దిగా కిందికి వంగి ఉన్నప్పుడు, వెలువడే శబ్ధం నేలకు తగిలి ప్రతిధ్వనిస్తుంది. ఇది కారు సౌండ్ టోన్‌ను మారుస్తుంది. ఎగ్జాస్ట్ టిప్స్ కారు శబ్ధం వాల్యూమ్‌ను పెంచలేవు కానీ.. శబ్ధం వినబడే విధానాన్ని మారుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+