Gold Price : చీప్ గా బంగారం. ప్రపంచంలో గోల్డ్ చౌకగా దొరికే దేశాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా బంగారం అంటే సంపద, భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ప్రతీక. భారత్‌లో అయితే బంగారం ధరలు రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నేడు దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము నేడు(12-01-2026) ధర ₹14,215కి చేరింది. పెట్టుబడిదారులు, సామాన్య ప్రజలు బంగారాన్ని భవిష్యత్ భద్రతగా భావిస్తుండటంతో డిమాండ్ భారీగా పెరిగింది. కానీ ఇదే బంగారం కొన్ని దేశాల్లో మాత్రం ఆశ్చర్యకరంగా చాలా తక్కువ ధరలకు లభిస్తుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలోనే ప్రపంచంలో బంగారం చాలా చౌకగా దొరికే దేశాలేవి? అక్కడ బంగారం ధర ఎందుకు తక్కువ? తెలుసుకుందాం.

వెనిజులా

ప్రపంచంలో బంగారం అత్యంత చౌకగా లభిస్తున్న దేశంగా వెనిజులా పేరు వినిపిస్తోంది. అక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర భారత రూపాయల్లో లెక్కిస్తే గ్రాముకు సుమారు ₹180 - ₹200 మధ్యే ఉంది. 22 క్యారెట్ల బంగారం అయితే దాదాపు ₹150 - ₹160 వరకే లభిస్తోంది. దీనికి ప్రధాన కారణం వెనిజులా కరెన్సీ అయిన బొలివర్ తీవ్రంగా విలువ కోల్పోవడం. ఏళ్ల తరబడి కొనసాగిన హైపర్ ఇన్‌ఫ్లేషన్, రాజకీయ అస్తిరత, ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడి కరెన్సీ దాదాపు కాగితం ముక్కలా మారింది. గతంలో ప్రభుత్వం భారీగా బంగారు నిల్వలను విదేశాలకు విక్రయించడంతో కూడా స్థానిక మార్కెట్‌లో ధరలు అసమానంగా మారాయి. అయితే ధరలు చౌకగా ఉన్నా, అక్కడి ప్రజల జీవితం మాత్రం తీవ్రమైన ఆర్థిక కష్టాల్లోనే ఉంది.

Why Gold Is Shockingly Cheap in Venezuela Countries Where Gold Prices Are Lowest in the World

ఇరాన్

ఇరాన్‌లో కూడా బంగారం ధరలు భారతదేశంతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు ₹7,000 - ₹7,500 మధ్య ఉంటుంది. అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక నిర్బంధాల కారణంగా ఇరాన్ కరెన్సీ రియాల్ తీవ్రంగా బలహీనపడింది. ప్రజలు తమ పొదుపును కాపాడుకోవడానికి నగదు కంటే బంగారాన్నే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో బంగారం స్థానికంగా ఎక్కువగా ట్రేడ్ అవుతూ, పన్నులు తక్కువగా ఉండటం వల్ల ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే తక్కువగా కనిపిస్తున్నాయి.

టర్కీ

టర్కీలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు ₹8,000 - ₹8,500 మధ్యలో ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో టర్కీ లీరా విలువ భారీగా పడిపోవడంతో అక్కడి ప్రజలు బంగారాన్ని భద్రతా పెట్టుబడిగా భావిస్తున్నారు. ప్రభుత్వం బంగారం దిగుమతులపై పన్నులు తగ్గించడం, స్థానికంగా బంగారం వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల ధరలు భారత్‌తో పోలిస్తే కొంత తక్కువగా ఉంటున్నాయి.

సింగపూర్

సింగపూర్‌లో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు చాలా దగ్గరగా ఉంటాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర సుమారు ₹8,600 - ₹8,800 మధ్య ఉంటుంది. సింగపూర్ ఒక గ్లోబల్ బులియన్ హబ్ కావడం వల్ల బంగారంపై జీఎస్టీ లేదా భారీ పన్నులు ఉండవు. స్వచ్ఛమైన బంగారం ట్రేడింగ్‌కు అనుకూల విధానాలు ఉండటంతో, ధరలు భారతదేశంతో పోలిస్తే తక్కువగా కనిపిస్తాయి.

స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్ ప్రపంచ బంగారం శుద్ధి కేంద్రంగా ప్రసిద్ధి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు ₹8,600 - ₹8,700 ఉంటుంది. బంగారం రిఫైనింగ్, నిల్వలు, ట్రేడింగ్ అన్నీ ఒకే చోట జరగడం, అలాగే పన్నులు తక్కువగా ఉండటం వల్ల బంగారం ధరలు ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో చాలా పోటీగా ఉంటాయి. అందుకే ప్రపంచంలోని పెద్ద పెట్టుబడిదారులు స్విట్జర్లాండ్‌ను బంగారం హబ్‌గా భావిస్తారు.

అమెరికా

అమెరికాలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు ₹8,500 - ₹8,700 మధ్య ఉంటుంది. డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ కావడం, బంగారం పై అదనపు దిగుమతి పన్నులు తక్కువగా ఉండటం వల్ల అక్కడ ధరలు స్థిరంగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు దగ్గరగా ట్రేడింగ్ జరగడం వల్ల భారత్‌తో పోలిస్తే తక్కువగా అనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+