పండుగ ఆఫర్: రూ.2,499కే స్కూటర్ మీ సొంతం!
పండుగ సీజన్ ను పురస్కరించుకుని ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా ఇండియాలోని తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్లపై ఆకర్షణీయమైన ప్రమోషనల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులు తక్కువ డౌన్ పేమెంట్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధికారిక యమహా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి.
125 సీసీ స్కూటర్లపై డిస్కౌంట్లు
యమహా కంపెనీ తమ అత్యంత ప్రజాదరణ పొందిన ఫాసినో 125, రేజెడ్ఆర్ 125 హైబ్రిడ్ స్కూటర్లపై ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తోంది. ఈ రెండు స్కూటర్లను కేవలం రూ.2,499 కనీస డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. వీటి కొనుగోలుపై రూ.3,399 విలువైన ఉచిత ఇన్సూరెన్స్ ప్రయోజనాలు లభిస్తాయి. యమహా ఫాసినో 125 ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధర రూ.78,980 కాగా.. రేజెడ్ఆర్ 125 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.80,680గా ఉంది.

150సీసీ, 155సీసీ మోటార్ సైకిళ్లపై పండుగ ఆఫర్లు
యమహా తమ మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోలోని FZ, XSR, R15, MT-15 మోడళ్లపై కూడా ప్రత్యేక ఫైనాన్స్ ఆప్షన్లను అందిస్తోంది. యమహా FZ సిరీస్ మోడళ్ల కొనుగోలుపై వినియోగదారులు రూ.5,999 వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బైకులకు కనీస డౌన్ పేమెంట్ రూ.3,900గా నిర్ణయించారు. యమహా XSR 155 మోడల్ పై రూ.5,555 వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో పాటు కనీసం రూ.4,999 డౌన్ పేమెంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. యూత్ ఐకాన్ గా నిలిచిన యమహా R15, MT-15 మోడల్ స్పోర్ట్స్ బైకులను కూడా కేవలం రూ.4,999 కనీస డౌన్ పేమెంట్ చెల్లించి సొంతం చేసుకోవచ్చు. కొత్త వెహికల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ పండుగ సీజన్ సరసమైన ఫైనాన్స్ ఆప్షన్లను అందిస్తోంది.













Click it and Unblock the Notifications
