Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chennai Super Kings:ధోనీ కెప్టెన్సీని భర్తీ చేసేది ఆ స్టార్ ఆల్‌రౌండరేనా..!

చెన్నై: ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌ ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగుల్చుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఐపీఎల్‌లో ఈ సారి ఫేవరెట్ జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ జట్టుకు నాయకత్వం వహించేది ఒక సూపర్ మ్యాన్. అతనే మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ కెప్టెన్సీ చేసిన ఏ గేమ్ అయినా సరే అందులో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. టీమిండియాకు కెప్టెన్‌గా అయినా, ఐపీఎల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినా ఆయనలోని నాయకత్వ లక్షణాలు, సమయపాలనతో కూడిన నిర్ణయాలు జట్టుకు విజయాలను చేకూర్చాయి. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ధోనీకి చివరది అవుతుందనే ప్రచారం జరుగుతోంది.

ఐపీఎల్ 2023 మహేంద్ర సింగ్ ధోనీకి చివరి ఐపీఎల్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ధోనీ తర్వాత అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. మ్యాచ్ చేదాటి పోతోందని అంతా అనుకుంటున్న సమయంలో ధోనీ తీసుకునే నిర్ణయాలతో ఆ మ్యాచ్ గెలుస్తుంది. అతని ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. అందుకే ఓడిపోతుందనుకుంటున్న మ్యాచ్ ఎలాగైనా గెలుస్తుంది ఎందుకంటే అక్కడ ధోనీ ఉన్నాడన్న నమ్మకం అభిమానుల్లో ఉండేది. మరి అలాంటి కెప్టెన్ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దొరుకుతాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఇందుకు సమాధానం కూడా యాజమాన్యానికి దొరికింది.

Chennai Super Kings: Know who will succeed Dhoni as captain after his retirement from IPL 2023

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సీఎస్కే జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. అక్కడ చేరిన అభిమానులు దాదాపు అరగంట పాటు ధోనీ ధోనీ అంటూ నినాదాలు చేశారు. ఓ అరగంట తర్వాత ఫ్యాన్స్ స్వరాల్లో మార్పు కనిపించింది. ఒక్కసారిగా అంతా బెన్ స్టోక్స్ అంటూ గట్టిగా నినదించారు. ముందుగా ఒక అరీనాలో ప్రారంభమైన ఈ స్వరం ఆ తర్వాత గ్రౌండ్‌లోని మిగతా ప్రాంతాలకు పాకింది. గతం, ప్రస్తుతం,ఆ వెంటనే భవిష్యత్తు కెప్టెన్ ఎవరంటే ధోనీనే అని చెబుతారు. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్‌ నుంచి ధోనీ స్థానాన్ని బెన్ స్టోక్స్ భర్తీ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం స్పందించింది. "ధోనీ వచ్చే ఏడాది ఆడుతాడా లేదా అనేది తన ఇష్టం. అయితే తనకు ఎలాంటి జట్టు కావాలో అలాంటిది మేము ఇచ్చాం. మా పాత్ర అంతవరకే ఉంటుంది" అని సీఎస్కే మేనేజ్‌మెంట్ పేర్కొంది. ఇదిలా ఉంటూ సోషల్ మీడియాలో బెన్ స్టోక్స్ పై తమిళులు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ సాంగ్స్ ధోనీకి మాత్రమే వాడేవారు. ఇప్పుడు ఆ పాటలు బెన్‌స్టోక్స్‌కు కూడా వాడుతున్నారు. అంటే చెన్నై అభిమానులు ధోనీ తర్వాత స్టోక్స్ తమ కెప్టెన్‌గా అంగీకరిస్తున్న సంకేతాలు పంపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+