చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bumper offer: సెల్ ఫోన్ షాప్ భారీ ఆఫర్లు, ఒకే దెబ్బకు రిబ్బన్ కటింగ్, శుభం కార్డు, ఎంతపని చేశాడు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరునల్వేలి/ మదురై: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో అనేక మంది వ్యాపారాలు తల్లకిందులైనాయి. గత మార్చి నెల నుంచి లాక్ డౌన్ అమలు కావడం, కరోనా వైరస్ కంట్రోల్ లోకి రాకపోవడంతో పలువురు వ్యాపారాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక మంది వ్యాపారులు డిస్కెంట్ లు, బంపర్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. షాప్ పాతదైనా ఆఫర్ కొత్తది అంటూ ఓ సెల్ ఫోన్ షాప్ యజమాని చేసిన పనికి కొనుగోలు దారులు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. కరోనా లేదు నా తొక్కలేదు అంటూ వారికి కావాలసిన మొబైల్ పరికాలు కొనుగోలు చెయ్యడానికి పోటీ పడ్డాడు. ప్రజలు షాపు ముందు కొట్టుకోవడంతో షాక్ కు గురైన పోలీసులు, కార్పోరేషన్ అధికారులు ఆ షాప్ ను సీజ్ చేసి హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. షాప్ కు రిబ్బన్ కటింగ్ చెయ్యడం వెంటనే శుభం కార్డు వెయ్యడం వెంటవెంటనే జరిగిపోయాయి.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

రోజుకు 5 వేల నుంచి 6 వేలు

రోజుకు 5 వేల నుంచి 6 వేలు

తమిళనాడులో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తోంది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు ఆ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇప్పటికే లాక్ డౌన్ అమల్లో ఉంది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ముచ్చటగా 3 లక్షలా 90 వేలు దాటి పోయింది. తమిళనాడులో ప్రతిరోజు సరాసరి 5, 000 నుంచి 6, 000 మద్య కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సామన్య ప్రజలు హడలిపోతున్నారు.

సెల్ ఫోన్ షాప్ ఓనర్ మాస్టర్ ప్లాన్

సెల్ ఫోన్ షాప్ ఓనర్ మాస్టర్ ప్లాన్

తమిళనాడులోన తిరునల్వేలి జిల్లా (నెలై జిల్లా)లోని కొక్కిరాకుళంలో ఓ వ్యక్తి మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మార్చి నెలలో లాక్ డౌన్ అమల్లోకి రావడంతో కొక్కిరాకుళలంలోని ఆ మొబైల్ షాపు మూతపడింది. ఇటీవల అధికారులు షాపులు తీసి ప్రభుత్వ నియమాలు పాటించి వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. కేవలం మాస్క్ లు, శానిటైజర్లతో పాటు కరోనా వైరస్ ను అరికట్టడానికి ఉపయోగపడే వస్తువులు మాత్రమే ఎక్కువగా సేల్ కావడంతో చాలా మంది వ్యాపారులు అయోమయంలో పడిపోయారు. ఎలాగైనా తన వ్యాపారం జోరుగా సాగాలని, తన షాపులో ఉన్న ఓల్డ్ స్టాక్ మొత్తం ఖాళీ కావాలని ఆ మొబైల్ షాపు యజమాని ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.

తెరమీదకు టెంపర్ గ్లాస్, హెడ్ ఫోన్స్

తెరమీదకు టెంపర్ గ్లాస్, హెడ్ ఫోన్స్


షాపు పాతదైనా వ్యాపారం కొత్తది, ఆఫర్లు కొత్తవి, ఆలసించిన ఆశాభగం అంటూ ఆ సెల్ ఫోన్ షాపు యజమాని కొక్కిరాయకుళం నగరంలో జోరుగా ప్రచారంచేయించాడు. తన మొబైల్ షాప్ లో టెంపర్ గ్లాస్, హెడ్ ఫోన్స్ తక్కువగా ఉన్నాయని, కరోనా కాలంలో ప్రజల కష్టాలు గుర్తించి భారీ డిస్కెంట్ తో వాటిని విక్రయించాలని నిర్ణయించామని, ఒక్కవారం రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని సెల్ ఫోన్ షాపు యజమాని ఆటోలకు మైకులు తగిలించి కొక్కిరాయకుళం నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు జోరుగా ప్రచారం చేయించాడు.

రూ. 6 కే బంపర్ ఆఫర్, అరుపులు కేకలు

రూ. 6 కే బంపర్ ఆఫర్, అరుపులు కేకలు


ఏ మొబైల్ టెంపర్ గ్లాస్ అయినా, హోడ్ సెట్ అయినా సరే కేవలం రూ. 6 కే తాము విక్రయిస్తామని, అతి తక్కువ ధరకు మొబైల్ హెడ్ ఫోన్స్ లభ్యం అవుతాయని ప్రచారం జరడంతో వందల మంది ప్రజలు మొబైల్ షాపు దగ్గరకు పరుగులు తీశారు. భౌతికదూరం పాటించకుంటే కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలిసినా చాలా మంది ముఖాలకు మాస్క్ లు వేసుకోకుండా మొబైల్ షాపు ముందు గుమికూడి నేను ముందు వచ్చాను, లేదులేదు నేనే ముందు వచ్చాను అంటూ అరుపులు కేకలు వేస్తూ ఆ ప్రాంతం దద్దరిల్లిపోయేలా గొడవపడ్డారు.

కొట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎలా ?

కొట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎలా ?

ఉదయం ఎప్పుడు షాపు ఓపెన్ చేస్తారా, రూ. 6 కే టెంపర్ గ్లాస్, హెడ్ సెట్ కొట్టేద్దామా అంటూ ప్రజలు పోటీపడ్డారు. కరోనా నియమాలు గాలికి వదిలేసిన సెల్ ఫోన్ షాప్ యజమాని చిక్కింది చాన్స్ అంటూ నాలుగు రోజుల నుంచి జోరుగా వ్యాపారం చేశాడు. అయితే ప్రజలు వందల సంఖ్యలో సెల్ ఫోన్ షాపు ముందు గుమికూడి ఇక్కడికి ముందు వచ్చింది నువ్వానేనా అంటూ గొడవ పడి ఒకరిమీద ఒకరు పిడిగుద్దులతో దాడులు చేసుకుని రెచ్చిపోచారు. సెల్ ఫోన్ షాపు ముందు ఏం జరుగుతుందో ? అంటూ వచ్చిపోయేవాళ్లు గుమికూడటంతో మరో సమస్య ఎదురైయ్యింది.

రిబ్బన్ కటింగ్... వెంటనే శుభం కార్డు

రిబ్బన్ కటింగ్... వెంటనే శుభం కార్డు

సెల్ ఫోన్ షాపు ముందు మహాభారత యుద్దం జరుగుతోందని తెలుసుకున్న కార్పోరేషన్ అధికారులు పోలీసులను వెంటపెట్టుకుని అక్కడి వెళ్లారు. అక్కడ పోటీ పడుతున్న ప్రజలను కంట్రోల్ చెయ్యలేక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రజలు చెప్పినమాట వినకపోవడంతో పోలీసులు, కార్పోరేషన్ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. కరోనా వైరస్ ను కంట్రోల్ చెయ్యాలంటే వెంటనే బంపర్ ఆఫర్లు ప్రకటించిన సెల్ ఫోన్ షాను సీజ్ చెయ్యాలని నిర్ణయించారు. వెంటనే సెల్ ఫోన్ షాపును సీజ్ చెయ్యడంతో ప్రజల తిక్కకుదిరింది.

Recommended Video

Airtel Chairman Sunil Mittal Hints At Tariff Hike In Next 6 Months || Oneindia Telugu
షాపు పాతదే సార్... ఆఫర్ కొత్తది

షాపు పాతదే సార్... ఆఫర్ కొత్తది

కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ సెల్ ఫోన్ షాను నిర్వహిస్తున్నారని, లాక్ డౌన్ సమయంలో ఆ షాపు మూతపడిందని, ఇప్పుడు కొత్తగా కొత్త పేరు పెట్టి రంగలు వేసి కొత్త షాపు, కొత్త ఆఫర్లు అంటూ ఆ షాపు యజమాని ప్రకటనలు ఇచ్చాడని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, కార్పోరేషన్ అధికారులు షాక్ కు గురైనారు. మొబైల్ షాప్ యజమాని చేసిన పనికి ఎక్కడ కొక్కిరాయకుళం ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతాయో ? అనే భయంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

English summary
Bumper offer: A Cellphone shop in Nellai gives offer price for headset and Temper glass for Rs 6. Police puts seal for the shop because of heavy crowd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X