లారీ ఓనర్ కిరాతకం: 40 మందిపై అత్యాచారం: పోలీస్‌గా భయపెట్టి: రేప్ సీన్లు రికార్డ్
చెన్నై: తమిళనాడులో ఓ లారీ ఓనర్ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. అమానవీయంగా ప్రవర్తించాడు. 10 కాదు.. 20 కాదు.. ఏకంగా 40 మంది మహిళలపై అత్యాచారానికి తెగబడ్డాడు. అత్యాచార దృశ్యాలను రికార్డ్ చేసేవాడు. వాటితో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. తన దారుణ కృత్యాలను సాగించడానికి పోలీసునని చెప్పుకొనే వాడు. నాలుగేళ్లుగా అతను ఈ ఘాతుకానికి పాల్పడుతూ వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎట్టకేలకు అతణ్ని అరెస్టు చేశారు. న్యాయస్థానంలో ముందు ప్రవేశపెట్టారు. కోర్టు అతణ్ని 14 రోజుల రిమాండ్‌కు పంపించింది.

ప్రేమికులే ఇతని టార్గెట్
అతని పేరు పిచ్చైమణి. 36 సంవత్సరాలు. చెన్నై శివార్లలోని తొండియార్ పేటకు చెందిన పిచ్చైమణికి రెండు లారీలు ఉన్నాయి. భార్య, పిల్లలతో తొండియర్ పేటలో నివాసం ఉంటున్నాడు. రెడ్‌హిల్స్, పుఝల్ ప్రాంతాల్లో జులాయిగా తిరిగేవాడు. ఖాకీ డ్రెస్‌లో బైక్‌పై తిరుగుతూ ఒంటరిగా ఉన్న ప్రేమికులను జంటలను టార్గెట్‌గా చేసుకునే వాడు. తాను పోలీసునంటూ బెదిరించి, యువతులు, మహిళలపై అత్యాచారానికి పాల్పడే వాడు.

బ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకుంటాడు
మొదట్లో సముద్రతీర ప్రాంతాల్లో విహారానికి వచ్చే ప్రేమికులు, భార్యభర్తలను బెదిరించి దోచుకునే వాడని, క్రమంగా లైంగిక దాడులకు అలవాటు పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. నిర్మానుష్య ప్రదేశాల్లో ఏకాంతంగా ఉన్న ప్రేమజంటలను వీడియోలు, ఫొటోలు తీసేవాడని, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి, బ్లాక్‌మెయిల్‌కు దిగేవాడని, మహిళలపై అత్యాచారం చేసి, తన కామవాంఛ తీర్చుకునేవాడని తెలిపారు. ఇప్పటి వరకూ సుమారు 40 మందిపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించారు.
Recommended Video

పక్కా స్కెచ్‌తో పోలీసులు
పిచ్చైమణి చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు ఒకరు పుజల్ పోలీసులను ఆశ్రయించడంతో అతని ఘాతుకాలు బహిర్గతం అయ్యాయి. పిచ్చైమణిని పోలీసులు వలపన్ని మరీ అరెస్టు చేశారు. దీనికోసం పోలీసులు సినీ ఫక్కీలో వ్యవహరించారు. ఓ మహిళతో ఫోన్ చేయించి, అతణ్ని పట్టుకున్నారు. విచారణ సందర్భంగా పిచ్చైమణి తన నేరాలను అంగీకరించాడని పుజల్ పోలీసులు తెలిపారు. అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్నవన్నీ న్యూడ్ ఫొటోలు, అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలు అందులో రికార్డయి ఉన్నాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications