చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Attack: పక్కాప్లాన్ తో గుడి దగ్గర ముబిన్ కారు పేలుడు, స్కెచ్ రివర్స్, అందుకే సజీవదహనం, ఫోరెన్సిక్!

|
Google Oneindia TeluguNews

చెన్నై/కోయంబత్తూరు: కోయంబత్తూరులో శివుడి దేవాలయం ముందు కారు పేలుడు జరిగిన కేసులో సజీవదహనం అయిన జమేషా ముబిన్ అలియాస్ ముబిన్ గురించి రోజుకొక సమాచారం బయటకు వస్తోంది. ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో లింక్ పెట్టుకున్న ముబిన్ పక్కాప్లాన్ తో కారు పేలుడు జరపాలని అనుకున్నాడని, అయితే చివరి నిమిషంలో అది బెడిసికొట్టిందని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. చెన్నై ఫోరెన్సిక్ రిపోర్టులో కోయంబత్తూరు కారు పేడుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.

ఇప్పటికే గుడి దగ్గర పోలీసులు సీసీటీవీ పుటేజీలు స్వాధీనం చేసుకున్నారు. కారు పేలుడులో సజీవదహనం అయిన జమేషా ముబిన్ అలియాస్ ముబిన్ గురించి పోలీసు అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ నుంచి తప్పించుకుని కారు పేలుడులో సజీవదహనం అయిన ముబిన్ ఇంటిలో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Wife: అర్దరాత్రి ఇంటికి వెళ్లిన భర్త, బెడ్ రూమ్ లో భార్య కిలకిలా, పకపకా అంటూ?!Wife: అర్దరాత్రి ఇంటికి వెళ్లిన భర్త, బెడ్ రూమ్ లో భార్య కిలకిలా, పకపకా అంటూ?!

గుడిని టార్గెట్ చేసిన ముబిన్

గుడిని టార్గెట్ చేసిన ముబిన్

తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని ఉక్కడం ఏరియాలోని కన్నప్పన్ నగర్ లోని పురాతన కోట ఈశ్వరన్ దేవాలయం ముందు అక్టోబర్ 25వ తేదీ వేకువ జామున నాలుగు గంటల సమయంలో కారులో పేలుడు సంభవించింది. మొదట కారులో గ్యాస్ సిలిండర్ పేలడం వలన పేలుడు జరిగిందని అందరూ అనుకున్నారు. అయితే అదే కారులో సజీవదహనం అయిన జమేషా ముబిన్ గుడిని టార్గెట్ చేసుకుని స్కెచ్ వేశాడని వెలుగు చూసింది.

ఎన్ఐఏకి అప్పగించిన సీఎం

ఎన్ఐఏకి అప్పగించిన సీఎం

కోయంబత్తూరులో జరిగిన కారు పేలుడు కేసును ఎన్ఐఏకి అప్పగించాలని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. కోయంబత్తూరులో కారు పేలుడులో సజీవదహనం అయిన జమేషా ముబిన్ అలియాస్ ముబిన్ గురించి పోలీసు అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగారు. గతంలో ఎన్ఐఏ నుంచి తప్పించుకుని కారు పేలుడులో సజీవదహనం అయిన ముబిన్ ఇంటిలో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

అందరిని పట్టుకున్న అధికారులు

అందరిని పట్టుకున్న అధికారులు

ఓటుపట్టరై ప్రాంతంలో నివాసం ఉంటున్న మోహమ్మద్ తల్కా, మోహమ్మద్ అజారుద్దీన్, మోహమ్మద్ రియాజ్, ఫైరోజ్ ఇస్మాయిల్, మోహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్ అనే ఐదు మందిని అరెస్టు చేసి విచారణ చేశారు. సీసీటీవీ పుటేజీల దెబ్బతో మొత్తం మ్యాటర్ బయటకు వచ్చింది. కారు పేలుడు జరిగిన సంఘటనా స్థలంలో అధికారులు పేలుడు పదార్థాలు,

ముబిన్ స్కెచ్ రివర్స్

ముబిన్ స్కెచ్ రివర్స్

జమేషా ముబిన్ శవానికి కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ముబిన్ శరీరంలో రెండు అంగులా లోతులో ములుకులు (ఇనుప కడ్డీలు) చొచ్చుకుపోయాయని, గుండెతో పాటు శరీరంలోని అనేక చోట్ల ఇనుప కడ్డీలు చొచ్చుకుపోవడంతో రక్త ప్రసరణ ఆగిపోయి అతను అక్కడికక్కడే చనిపోయాడని వైద్యులు నివేదిక ఇచ్చారు.

 ఫోరెన్సిక్ నిపుణులు

ఫోరెన్సిక్ నిపుణులు

ముబిన్ చనిపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు అనేక ఆధారాలు సేకరించారు. సంఘటనా స్థలంలో ఇనుప కడ్డీలు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించారు. ముబిన్ గుడి దగ్గర పక్కా ప్లాన్ తో కారు పేలుడు జరపాలని ప్రయత్నించాడని విచారణలో వెలుగు చూసింది. అయితే ముబిన్ కారులో ఉన్న సమయంలోనే పేలుడు జరిగి బయటకు రాలేక అతను స్పాట్ లో చనిపోయాడని అధికారులు అంటున్నారు.

ఉగ్రవాదులతో లింక్ ?.... ఎన్ఐఏ దగ్గర బలమైన సాక్షాలు

ఉగ్రవాదులతో లింక్ ?.... ఎన్ఐఏ దగ్గర బలమైన సాక్షాలు

జమేషా ముబిన్ ను 2019లోనే ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయితే సరైన సాక్షాలు లేకపోవడంతో ముబిన్ బయటపడిపోయారు. అయితే కోయంబత్తూరు కారు బాంబు పేలుడు జరిగిన తరువాత ముబిన్ కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు బలమైన సాక్షాలు సంపాదించారని సమాచారం.

English summary
The information released based on the autopsy results of Jamesha Mubin in Coimbatore car blast case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X