ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పుత్తూరు నియోజ‌క‌వ‌ర్గం నుండి వ‌డ‌మాల పేట‌, పుత్తూరు మండ లాలు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఇక్క‌డ అనేక సంవ‌త్స‌రాలుగా ముద్దు - చెంగాల మ‌ధ్య ఈ ప్రాంతంలో ఆధిప‌త్య పోరు కొన‌సాగింది. పుత్తూరు లో అయిదు సార్లు గెలుపొందిన ముద్దు కృష్ణ‌మ‌నాయుడు న‌గ‌రిలో ఆరో సారి గెలిచారు. చెంగా రెడ్డి న‌గ‌రి లో అయిదు సార్లు గెలుపొందిన సీనియ‌ర్ నేత‌. ప‌లువురు మంత్రివ‌ర్గాల‌లో ప‌ని చేసారు. 1983 లో టిడిపి తో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసి నాలుగు సార్లు ఆ పార్టీ అభ్య‌ర్ధిగా ప‌ని చేసి 1999 లో కాంగ్రెస్ లో చేరారు. 2004 లో కాంగ్రెస్ అభ్య‌ర్దిగా గెలిచి ఆ త‌రువాత 2009 లో తిరిగి టిడిపికి వ‌చ్చారు.

12 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
న‌గ‌రి లో ఇప్ప‌టి వ‌ర‌కు 12 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా..అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి మూడు సార్లు, ఒక‌సారి స్వ తంత్ర అభ్య‌ర్ధి, ఒక‌సారి వైసిపి అభ్య‌ర్ధి గెలుపొందారు. సినీ న‌టి రోజా టిడిపి అభ్య‌ర్ధిగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపో యారు. 2014 ఎన్నిక‌ల ముందు వైసిపి లో చేరిన రోజా టిడిపి అభ్య‌ర్ది గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు పై 858 ఓట్ల ఆధి క్యంతో గెలుపొందారు. ఒక‌సారి న‌గ‌రిలో..మ‌రోసారి చంద్ర‌గిరిలో పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి ఎమ్మెల్యేగా మ‌హిళా అధ్య‌క్షురాలిగా కీల‌క పాత్ర పోషించారు. శాన‌న‌స‌భ‌లో అనుచితంగా ప్రవ‌ర్తించార‌నే కార‌ణంలో రోజా పై ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ వేటు వేసారు. దీని పై రోజా సుప్రీం కోర్టు వ‌ర‌కు వెళ్లారు. అయినా..శాస‌న‌స‌భ మాత్రం స‌స్పెన్ష‌న్ వేటు ఎత్తి వేయ‌లేదు. స‌స్పెన్ష‌న్ స‌మ‌యం ముగిసే స‌మ‌యానికి వైసిపి అసెంబ్లీ బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం తీసుకుంది.

#AndhraPradeshElections2019: All about Nagari Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 185445 ఓట్లు ఉండ‌గా, అందులో 157748 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన రోజాకు 74724 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన ముద్దుకృష్ణ‌మ‌నాయుడుకు 73866 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి నుండి పోటీ చేసి రోజా 858 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్క‌డ ఓట‌మి తో సీనియ‌ర్ నేత ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కు టిడిపి అధినాయ‌క‌త్వం ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు. కొద్ది కాలం క్రితం ఆయ‌న అనారోగ్యం తో మృతి చెందారు . దీంతో..ఆయ‌న భార్య‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+