ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సత్యవేడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నగరి నియోజకవర్గం నుండి నారాయణవనం మండలం, పిచ్చాటూరు మండలం, కెవి బిపురం పూర్తిగా సత్యవేడు నియోజకవర్గంలో చేరాయి. పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా బాధ్యతలు నిర్వహిం చిన సి దాస్ సత్యవేడు లో మూడు సార్లు గెలుపొందారు. ఆయన రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. సురాజన్ ఇక్క డ రెండు సార్లు నెగ్గారు. ఇక్కడ ఒకసాగి గెలిచిన డాక్టర్ శివప్రసాద్ చిత్తూరు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2014 ఎన్నికల నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపో యాయి. వైసిపి అవిర్బావంతో కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి.
12 సార్లు ఎన్నికలు జరగ్గా..
సత్యవేడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి ఆరు సార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచింది. 1983 లో టిడిపి నుండి గెలిచిన తలారి మనోహర్ కుమారుడు ఆదిత్య 2014 ఎన్నిక ల్లో ఇక్కడి నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసారు. 2009 లో ఇక్కడి నుండి టిడిపి తరపున గెలిచిన హేమలత కు 2014 ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవటంతో ఆదిత్య బరిలోకి దిగారు. ఇక, వైసిపి నుండి ఆదిమూలం బరిలో నిలిచారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గంలో మొత్తంగా 193718 ఓట్లు ఉండగా, అందులో 160145 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన ఆదిత్య కు 77655 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన ఆదిమూలం కు 73428 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి గెలిచిన ఆదిత్య కు 4227 ఓట్ల మెజార్టీ దక్కింది. తలారి ఆదిత్య ప్రస్తత శాసనసభలో ప్యానెల్ స్పీకర్ గా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో వీరే అభ్యర్ధులుగా..
వచ్చే ఎన్నికల్లో టిడిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి ఆదిత్య తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. టిడిపి దీని పై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇక, వైసిపి నుండి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిమూలం తిరిగి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి వైసిపి అభ్యర్దిగా పోటీ చేసిన పీటర్ సుబ్బయ్య కు 13823 ఓట్లు వచ్చాయి. ఇక, జనసేన ఈ సారి అభ్యర్ధిని బరిలోకి దించే అవకాశం ఉంది. దీంతో..ఇక్కడ అభ్యర్ధుల ఖారారైన తరువాత పోటీ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications