చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Techie: పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది ?, బర్త్ డే రోజు టెక్కీ ప్రాణం పోయింది, అసలు మ్యాటర్ ఏంది ? !

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తండ్రి పేపర్ ప్లేట్ లు తయారు చేసే పరిశ్రమ పెట్టుకుని అతని పిల్లలను బాగా చదివించాడు. ఓ కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. టెక్కీ బర్త్ డే రోజు ఇంటికి వెళ్లాడు. రాత్రి తండ్రి కొడుకు సంతోషంగా భోజనం చేశారు. రాత్రి రెండు అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించడంతో తండ్రీ కొడుకులతో పాటు ఓ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే అసలు విషయం ఏమిటి ?, ప్రమాదం ఎలా జరిగింది ?, అర్దరాత్రిలో షార్ట్ సర్క్ ట్ ఎలా జరిగింది ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Girlfriend: ప్రియురాలు, ఆంటీ బెడ్ రూమ్ వీడియోలు తీసిన డాక్టర్ ప్రియుడు, వైరల్ దెబ్బకు డాక్టర్ ఢమాల్ !Girlfriend: ప్రియురాలు, ఆంటీ బెడ్ రూమ్ వీడియోలు తీసిన డాక్టర్ ప్రియుడు, వైరల్ దెబ్బకు డాక్టర్ ఢమాల్ !

సాఫ్ట్ వేర్ ఇంజనీరు

సాఫ్ట్ వేర్ ఇంజనీరు

చిత్తూరు నగరంలోని రంగాచారి వీధిలో భాస్కర్ (65) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రెండు అంతస్తుల భవనంలో భాస్కర్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నాడు. భాస్కర్ కుమారుడు ఢిల్లీ బాబు (33) సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఢిల్లీ బాబు భార్య దుబాయం లో ఉంటున్నది.

 పేపర్ ప్లేట్ ల పరిశ్రమ

పేపర్ ప్లేట్ ల పరిశ్రమ

భాస్కర్ ఆయన భవనంలో పేపర్ ప్లేట్ లు తయారు చేసే పరిశ్రమ పెట్టుకున్నాడు. మంగళవారం ఢిల్లీ బాబు బర్త్ డే. ఢిల్లీ బాబు స్నేహితుడు బాలాజి (27) మంగళవారం రాత్రి ఢిల్లీ బాబు ఇంటికి వెళ్లారు. రాత్రి భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు స్నేహితుడు బాలాజీ అక్కడే ఉన్నారు.

రెండు అంతస్తుల భవనంలో మంటలు

రెండు అంతస్తుల భవనంలో మంటలు

అర్దరాత్రి 2 గంటల సమయంలో భాస్కర్ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన మంటలు వ్యాపించాయి. ఇంటి చివరి గదిలో ఉన్న భాస్కర్, ఢిల్లీ బాబు, బాలాజీ మంటలు తప్పించుకుని బయటకు రాలేకపోయారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాల్లో వెళ్లి మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు.

బర్త్ డే రోజు టెక్కీ ప్రాణం పోయింది

బర్త్ డే రోజు టెక్కీ ప్రాణం పోయింది


స్థానికులు తలుపులు పలగొట్టి భాస్కర్, ఢిల్లీ బాబు, బాలాజీని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఊపిరిఆడక ముగ్గురు చనిపోయారని వైద్యులు చెప్పారు. ఢిల్లీ బాబు బర్త్ డే రోజు అతను చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి. విద్యుత్ షార్ట్ సర్కూట్ వలనే మంటలు వ్యాపించాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

English summary
Chittoor: Fire accident in paper plates factory in Chittoor in Andhra Pradesh. three people died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X