కలిసి బతకలేం.. చస్తాం, ప్రేమ జంట వీడియో.. చివరికీ ఇలా..
ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకరినీ విడిచి మరొకరు ఉండలేరు. కానీ పెద్దలు నో అన్నారు. కలిసి బతకలేని పరిస్థితి నెలకొంది. ఉండలేని సిచుయేషన్ భరించలేకపోయారు. కలిసి చనిపోదాం అని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది పురుగుల మందు తాగారు. అంతకుముందు వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి ఆచూకీని కనిపెట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డారు.

కలిసి బతకలేం..
చిత్తూరు తంబళ్ళపల్లె మండలం కోటాలలో ప్రేమ జంట పరిస్థితి ఇది. నాబోయపల్లెకు చెందిన ప్రేమజంట బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ మేరకు వీడియో సందేశం పంపారు. ప్రేమించుకున్న తమను విడదీస్తారని.. పురుగుల మందు తాగి చావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ ప్రేమికులు పురుగుల మందు తాగుతున్నట్లు చెప్పారు. నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారింది. వారి లైవ్ లొకేషన్ కదిరి మండల పరిధిలోని లగువమ్మకొండ సమీపంలో ఉన్నట్లు తెలుసుకున్నారు.

వాయువేగంతో..
కదిరి పోలీసులు.. ములకల చెరువు పోలీసులు కూడా సమన్వయం చేసుకుని అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడి నుంచి మరో చోటకు వెళ్ళిపోయారు. ఇలా వారి లొకేషన్ ఆధారంగా పలు చోట్ల వెతికి చివరికీ వారిని పట్టుకునన్నారు. సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ జంట మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం నుంచి బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

నిలిచిన ప్రాణాలు
ప్రేమ పేరుతో క్షణికావేశంలో జీవితం నాశనం చేసుకోవద్దు అని పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్దలు చెప్పినట్టు వినాలని కోరారు. వారిద్దరూ ఇప్పటికీ అయితే ఆరోగ్యం బాగానే ఉంది. కానీ అంతకుముందు మాత్రం యువతి మాట్లాడింది. తాను ఇప్పుడు మేజర్ అని తెలిపింది. ఇంట్లో వెళ్లిన సమయంలో మైనర్ అని.. కానీ ఇప్పుడు మేజర్ అని చెప్పింది. అయినా పెళ్లి మాత్రం చేయరని తెలియజేసింది. అందుకోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.. కానీ పోలీసులు చకచక్యంతో వ్యవహరించారు. ఇద్దరీ ప్రాణాలను నిలిపారు.












Click it and Unblock the Notifications