వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండె నొప్పితో ప్రముఖ హాస్య నటుడు మృతి

By Srikanya
|
Google Oneindia TeluguNews

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ హాస్యనటుడు రజాక్‌ఖాన్‌ కన్నుమూశారు. ముంబయి బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ లో గుండెపోటుతో మధ్యాహ్నం 12.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖాన్ గుండెనొప్పితో బాధపడుతూ ఈ ఉదయం ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయనను బంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఖాన్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Razakkhan

ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు షాజాద్‌ ఖాన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. రజాక్‌ ఖాన్‌ మృతిపట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

రేపు సాయంత్రం 4 గంటల తర్వాత ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కామెడీ నైట్స్ విత్ కపిల్ టీవీ షోతో ఖాన్ పాపులర్ అయ్యారు.

హాలో బ్రదర్, హీరా పేరీ, బాద్‌షా, రూప్ కీ రాణి చోరాన్ కా రాజా, రాజా హిందుస్తానీ, హసీనా మాన్ జాయేగీతో పాటు పలు చిత్రాల్లో హాస్యాన్ని పండించారు. సుమారు 90 సినిమాల్లో ఖాన్ నటించారు. ఖాన్ మృతి పట్ల బాలీవుడు ప్రముఖులు సంతాపం తెలిపారు.

English summary
Razak Khan, who made the audiences laugh all throughout the 90s through his unique brand of comedy breathed his last on June 1, 2016. The actor passed away due to cardiac arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X