వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ సహాయమే ఈ బిడ్డ ప్రాణాలు నిలుపుతుంది.. ఆ తల్లిదండ్రుల కన్నీరు తుడుస్తుంది

Google Oneindia TeluguNews

అప్పుడే పుట్టిన బిడ్డ ఇంక్యుబేటర్‌లో ఉండటం చూసి ఏ తల్లి తట్టుకోలేదు. ఎవరూ తట్టుకోలేరు. అలాంటి పరిస్థితే ప్రమీలా అనే ఈ తల్లికి ఎదురైంది. ఫోటోలో కనిపిస్తున్న బిడ్డ నెలలు నిండకముందే లోకంలోకి వచ్చింది. ముందస్తుగా పుట్టడంతో బిడ్డ ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ దృశ్యాన్ని చూడలేక కన్నీరు మున్నీరవుతోంది ప్రమీలా. ఈ ఆడపాప కంటే ముందు కడుపులోనే ఓ బిడ్డను కోల్పోయింది ప్రమీలా. చాలా ఏళ్లకు సంతానం కలిగి తల్లి అవుతుందన్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అయితే మళ్లీ గర్భం దాల్చిన ప్రమీలా ఈ సారి తన బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ ఆనందం కూడా ఎంతో కాలం నిలవలేదు.

గతేడాది నవంబర్ 25న ప్రమీలా బ్లీడింగ్‌ అవుతూ నిద్ర లేచింది. ఆ సమయంలో ఆమె 6 నెలల నిండు గర్భిణీ. బ్లీడింగ్ అవుతుండటంతో వెంటనే తన భర్త ఆండ్రూ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ఎమర్జెన్సీ గదిలోకి తీసుకెళ్లిన వైద్యులు ఆమెను కొన్ని గంటల పాటు పర్యవేక్షించారు. డెలివరీ కాస్త ఆలస్యం అయ్యేందుకు ప్రమీలాకు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు వైద్యులు. కానీ అవేమీ ఫలితాలు ఇవ్వలేదు. నొప్పులు ఎక్కువైయ్యాయి. ఇక లాభం లేదని భావించిన వైద్యులు ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి ఆడ శిశువును బయటకు తీశారు. అంతా బాగానే ఉంది. కానీ బిడ్డ మాత్రం ఎలాంటి చప్పుడు చేయలేదు. వెంటనే డాక్టర్లు పసికందును ఎన్‌ఐసీయూలోకి తీసుకెళ్లారు. చిన్నారిని ఒక టవెల్‌లో చుట్టారు. ఇలాంటి బాధాకరమైన పరిస్థితి మరే తల్లిదండ్రులకు రాకూడదని ప్రమీల కన్నీరుమున్నీరైంది.

Confined To The Incubator, This Newborn Baby Needs Help To Survive

పుట్టగానే ప్రమీలా బిడ్డ 600 గ్రాముల బరువు మాత్రమే ఉంది. శ్వాససంబంధిత సమస్యతో బిడ్డ ఇబ్బంది పడుతోంది. నెలలు నిండకముందే బిడ్డ పుట్టడంతో మరికొన్ని ఆరోగ్య సమస్యలు తోడయ్యాయి. ఒక బిడ్డకు జన్మనిచ్చి చూడాలన్న కోరిక కొన్నేళ్లుగా ఉందని చెప్పిన ప్రమీలా... బిడ్డ అలా పుట్టగానే చూసేందుకు ధైర్యం చాల్లేదని చెప్పుకొచ్చింది. తన బిడ్డ చాలా చిన్నదిగా ఉండటం ఒక బాక్స్‌లో పెట్టడం చూసి మనసు తరుక్కుపోయిందని చెప్పింది ప్రమీలా. అంతేకాదు ఆ లేత శరీరంకు ఎన్నో పైపులు కనెక్ట్ అయి ఉండంటం చూసి కళ్లకు నీళ్లు ఆగలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన చేతుల్లో హాయిగా నిద్రపోవాల్సిన చిన్న తల్లి ఇలా ప్రాణాలకోసం పోరాడుతుండటం చూసి ప్రమీలా వెక్కి వెక్కి ఏడుస్తోంది.

Confined To The Incubator, This Newborn Baby Needs Help To Survive

ఇప్పుడు పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. చికిత్సకు చిన్నారి స్పందిస్తోంది. మరో మూడు నెలల పాటు సరైన చికిత్స అందితే బిడ్డ పూర్తిగా కోలుకుంటుంది. అయితే ఇందుకు రూ.15 లక్షలు ఖర్చు అవుతుంది. జిమ్ మెయింటెయినర్‌గా పనిచేసే ఆండ్రూ నెల జీతం రూ.8వేలు. ఇది బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ఎంతమాత్రం సరిపోదు. ఇప్పటికే ఒక బిడ్డ పుట్టక ముందే మృతి చెందింది. కానీ రెండో బిడ్డపై మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రమీలా. తన బిడ్డను బతికించాలంటూ అర్థిస్తోంది. ఇందుకోసం దాతలు సహాయం చేసి తన బిడ్డను బతికించాల్సిందిగా కోరుతోంది. మీకు తోచినంతలో విరాళం ఇచ్చి ఈ బిడ్డను బతికించి ఆ తల్లిదండ్రులకు కానుకగా ఇవ్వండి.

Confined To The Incubator, This Newborn Baby Needs Help To Survive

విరాళాలను నేరుగా కింది బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయండి

Virtual A/C No:6999413500149231

Virtual A/C Name:Pramila-Ketto

A/C Type:Current

IFSC:YESB0CMSNOC

Ketto.org is a leading crowdfunding platform that supports crowdfunding for cancer, heart and many other treatments.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X