Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CSK vs MI: బిగ్ బ్యాంగ్: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే: సన్..రైజ్ అయ్యేనా?

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్ సెకెండ్ ఫేస్ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులను పలకరించబోతోన్నాయి. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ బ్యాలెన్స్ టోర్నమెంట్ ముగియనుంది. సాయంత్రం 7:30 గంటలకు మలిదశ తొలి మ్యాచ్ ఆరంభం కాబోతోంది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, వైఎస్ కేప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ తలపడబోతోన్నాయి.

ఎవరు టాప్..

ఎవరు టాప్..

ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో ఢిల్లీ కేపిటల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన ఈ టీమ్ ఆరు విజయాలను సొంతం చేసుకుంది. మొత్తం 12 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ఏడు మ్యాచుల్లో అయిదింటిని గెలిచింది ధోనీ సేన. 10 పాయింట్లు ఈ జట్టు ఖాతాలో ఉన్నాయి. చివరి అయిదు మ్యాచుల్లో ఒక్కదాంట్లో మాత్రమే పరాజయం పాలైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి, దూకుడు మీద ఉంది.

కప్ పై ఆశలు

కప్ పై ఆశలు

మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నిలిచింది. ఏడు మ్యాచుల్లో అయిదు విజయాలతో 10 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది కోహ్లీ టీమ్. ముంబై ఇండియన్స్ మాత్రం ఈ సారి పెద్దగా ప్రభావాన్ని చూపట్లేదు. గత సీజన్ తరహాలో వరుస విజయాలను అందుకోవట్లేదు. ఏడు మ్యాచుల్లో మూడింట్లో పరాజయాన్ని చవి చూసింది. ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోతే- జట్టు పరిస్థితి మరింత దిగజారుతుంది. అయిదో స్థానానికి లేదా అంతకంటే దిగువకు జారిపోయే ప్రమాదం ఎదుర్కొంటుంది.

సన్‌రైజర్స్ పరిస్థితి మరీ ఘోరం..

సన్‌రైజర్స్ పరిస్థితి మరీ ఘోరం..

ఆ తరువాతి స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఈ దఫా సన్.. రైజ్ అయ్యేలా కనిపించట్లేదు. ఏడు మ్యాచుల్లో ఒక్కదాంట్లో మాత్రమే గెలిచింది వార్నర్ టీమ్. ఆరు మ్యాచుల్లో పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ రేసులో నిల్చోవాలంటే ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌ను కూడా గెలిచి తీరాల్సిన స్థితికి చేరింది సన్‌రైజర్స్. స్టార్ బ్యాట్స్‌మెన్ కమ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో ఆడకపోవడం మైనస్ పాయింట్.

ప్లే ఆఫ్ రేస్‌లో నిల్చోవాలంటే..

ప్లే ఆఫ్ రేస్‌లో నిల్చోవాలంటే..

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్..ఈ దఫా టైటిల్ హాట్ ఫేవరెట్. ఎమిరేట్స్‌లోనే సాగిన ఐపీఎల్ సీజన్ 13లో ధోనీ సేన తీరు ఘోరం. దారుణ పరాజయాలను చవి చూసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకొన్న మొదటి జట్టుగా నిలిచింది. ఈ సారి ఆ పరిస్థితి కనిపించట్లేదు. తప్పులను సరి చేసుకుంది. వరుస విజయాలను అందుకుంటోంది. ఏడు మ్యాచుల్లో అయిదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన ఏడింట్లో మూడు మ్యాచ్‌లను గెలిచినా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ప్లే ఆఫ్ బెర్త్‌ రేసులో తొలి మ్యాచ్‌ను ఈ సాయంత్రమే ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.

యుఏఐ పిచ్‌లు అచ్చొచ్చేనా

యుఏఐ పిచ్‌లు అచ్చొచ్చేనా

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుధాబి, దుబాయ్, షార్జా స్టేడియాల్లో ఏ ఒక్కటీ చెన్నై సూపర్ కింగ్స్‌కు అచ్చి రాలేదు. ఇండియన్ పిచ్‌లపై అద్భుతంగా సత్తా చాటిన ధోనీ సేన మళ్లీ ఎమిరేట్స్‌లోనే మ్యాచ్‌లను ఆడాల్సి వచ్చింది..కరోనా వల్ల. ఈ ట్రిప్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎమిరేట్స్ పిచ్‌లు ముంబై ఇండియన్స్‌కు కలిసొచ్చేవే. గత సీజన్‌లో వరుస విజయాలను అందుకుంది.. టైటిల్‌ను ఎగరేసుకెళ్లింది.

కలిసొచ్చే గడ్డపై

కలిసొచ్చే గడ్డపై

ముంబై ఇండియన్స్ దూకుడు తగ్గినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే అయిదు సార్లు టోర్నమెంట్ విన్నర్‌గా నిలిచిన ముంబై.. మరోసారి టైటిల్‌ గెలవాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. గత సీజన్‌లో ఇదే గడ్డపై ట్రోఫీ సొంతం చేసుకుంది. అరబ్ గడ్డ ముంబై ఇండియన్స్‌కు బాగా కలిసొస్తున్నందున వరుస విజయాలను అందుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది నాలుగే. ప్లే ఆఫ్‌ చేరాలంటే మిగిలిన ఏడింట్లో కనీసం నాలుగు మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది.

బెటర్ పొజీషన్‌లో ఢిల్లీ..

బెటర్ పొజీషన్‌లో ఢిల్లీ..

ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం బెటర్ పొజీషన్‌లో ఉంది. ఎనిమిది మ్యాచ్‌లల్లో ఆరింట్లో విజయాన్ని సాధించింది. 12 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే ఇంకొక్క మ్యాచ్ ఆడితే చాలు. ఇదే దూకుడును కొనసాగించగలిగితే- ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టు ఇదే అవుతుంది. గత ఏడాది ఈ మెగా క్రికెట్ ఈవెంట్ రన్నరప్‌గా నిలిచింది ఢిల్లీ కేపిటల్స్. ఈ దఫా విన్నర్‌గా నిలవాలనే పట్టుదలను కనపరుస్తోంది.

ఫస్ట్ టైమ్..

ఫస్ట్ టైమ్..

ఇప్పటిదాకా ఢిల్లీ కేపిటల్స్ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఆ లోటును భర్తీ చేసుకుని సగర్వంగా స్వదేశానికి చేరాలనే కసిని ప్రదర్శిస్తోందా టీమ్. రిషభ్ పంత్ జోరు మీద ఉండటం, శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోవడం కలిసొచ్చే అంశాలు. ఈ సారి టైటిల్ విన్నర్‌గా ఉండే పేర్లల్లో ప్రస్తుతానికి ఢిల్లీ కేపిటల్స్ పేరు బాగా వినిపిస్తోంది. లీగ్ దశలో చూపించిన దూకుడు, జోరును ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో కొనసాగించడంపై ఆ జట్టు జర్నీ ఆధారపడి ఉంటుంది. ప్లే ఆఫ్స్‌లో తడబడినా.. పొరపాట్లు చేసినా ఈ దఫా కూడా నిరాశ తప్పదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+