ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు జడ్జీ 14 రోజుల రిమాండ్ విధించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. కేసు విచారించిన జడ్జి.. అనంతబాబుకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ఎసపీ ఆఫీసుకు కూడా వెళ్లారు. అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నెల 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపి మృతదేహాన్ని కారులో ఉంచి వదిలి వెళ్లాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

14 days remand to ycp mlc anantha babu

తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకోవడంతో తానే హత్య చేసినట్లు అనంతబాబు ఒప్పుకున్నడట. తాను హత్య చేయాలని భావించలేదని.. బెదిరించి వదిలేద్దామనుకున్నట్లు అనంతబాబు పోలీసులతో చెప్పారట. హత్యకు గురైన సుబ్రహ్మణ్యం.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేసి కొద్ది నెలల క్రితం మానేశాడు. గురువారం రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదంలో సుబ్రమణ్యం చనిపోయాడని సోదరుడికి స్వయంగా ఎమ్మెల్సీ ఫోన్ చేసి చెప్పారు. కొద్దిసేపటికి సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని కారులో ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. సుబ్రమణ్యంను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.

సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై రోజంతా పెద్ద హైడ్రామా నడిచింది. ముందు పోస్ట్‌మార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తర్వాత పోలీసులు వారిని ఒప్పించడంతో పోస్టుమార్టం నిర్వహించి రిపోర్ట్ అందజేశారు. అందులో సుబ్రహ్మణ్యంది హత్యగా తేలగా.. అతడిని కొట్టడంతోనే చనిపోయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో ప్రస్తావించారు. దాడి చేయడంతో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఆ తర్వాత అనంతబాబుపై కేసు నమోదైంది. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ కూడా విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+