Almonds Side Effects: బాదం పప్పు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఆ సమస్యలు తప్పవు..
బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి డ్రైఫ్రూట్స్ తినాలని చెబుతారు. డ్రైఫ్రూట్స్ లో బాదం ఒక్కటి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలకు పటిష్ఠత, బరువు అదుపులో ఉండటం, మానసికంగా సమతుల్యత, గుండె జబ్బులు, కేన్సర్ నియంత్రణలో ఉంటాయి. అయితే పనిగా తింటే తిప్పలు తప్పవని చెబుతున్నారు నిపుణులు.

మలబద్ధకాన్ని
బాదంలో ఫైబర్ అధికంగా ఉండే గింజలు. దాదాపు 23 బాదం గింజలు (ఇది 1 ఔన్స్‌కి సమానం) 3.5 గ్రాముల ఫైబర్‌ను ఇస్తాయి. పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉందట.

పోషకాల శోషణ తగ్గుతుంది
బాదంపప్పులో ఉండే అధిక ఫైబర్ మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్‌లతో బంధించి శరీరంలోని వాటి శోషణ తగ్గిస్తుంది.

బరువు పెరగడం
23 బాదం గింజలు (1 ఔన్స్)లో ఎన్ని కేలరీలు ఉన్నాయో మీకు తెలుసా? దాదాపు 164 కేలరీలు! బాదం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు.

అలర్జీ
జీడిపప్పు, వాల్‌నట్‌ల మాదిరిగానే బాదం కూడా కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. బాదంపప్పులో అలర్జీని కలిగించే అమాండిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కొన్ని అలెర్జీ ప్రతిచర్యలలో నాలుక వాపు, గొంతు గీతలు, పెదవి లేదా నోటి వాపు లేదా నోటి దురద వంటివి ఉంటాయి.

కిడ్నీలో రాళ్లు
బాదంపప్పులో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి పేగులో కరిగే సమ్మేళనాలు. ఆక్సలేట్లు అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంది. దాదాపు 100 గ్రాముల బాదంపప్పులో 469 మిల్లీగ్రాముల ఆక్సలేట్‌లను అందిస్తుంది.

విటమిన్ ఇ
బాదంపప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అందుకే ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, మీరు ఇప్పటికే విటమిన్ ఇ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటే లేదా విటమిన్ ఇ సప్లిమెంట్లను తీసుకుంటుంటే, మీరు రోజులో ఎక్కువ బాదంపప్పులను తినకూడదు.

థైరాయిడ్
బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు. అంటే థైరాయిడ్ సమస్యకు బాదం పాలు కారణమవుతాయి. బాదం పాలను పరిమితికి మించి తీసుకుంటే థైరాయిడ్‌కు హాని కల్గించే రసాయనాలు విడుదలయ్యేందుకు కారణమవుతాయి.












Click it and Unblock the Notifications