వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Boda Kakarakaya Benefits: లేట్ చేయకండి.. వెంటనే తినేయండి.. తర్వాత దొరకవు..

|
Google Oneindia TeluguNews

కూరగాయాలు అన్ని సీజన్లలో దొరుకుతాయి. కానీ బోడ కాకరకాయ మాత్రం కేవలం రెండు నుంచి మూడు నెలలు మాత్రమే దొరుకుతుంది. అయితే వీటిని పడించరు. ఇవి ఎక్కువ అటవీ ప్రాంతాల్లో దొరుకుతాయి. ఇది సీజన్ కూరగాయ కావడంతో ధర కూడా భారీగానే ఉంది. ప్రస్తుతం బోడ కాకరకాయ కిలో రూ.150 నుంచి 200 పలుకుతోంది.

అనేక పోషకాలు..

అనేక పోషకాలు..

ఇవి సహజ సిద్ధంగా దొరకడంతో వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బోడ కాకరకాయ శరీరానికి ఎంత మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఉంటుంది. అందుకే బోడకాకరను పోషకాల గని అంటారు.

బీపీ

బీపీ

వానాకాలంలో బోడ కాకరకాయలు తింటే, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. బోడ కాకరకాయ తింటే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా.. అదుపులో ఉంటాయట. బోడకాకరలో ఫోలేట్స్ అధికశాతం ఉంటాయట. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిక్

డయాబెటిక్

డయాబెటిక్ పేషంట్లకు బోడకాకర కాకర తింటే షుగర్ అదుపులో ఉంటుందట. ముఖ్యంగా రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుందట. బోడకాకరతో పులుసు, వేపుడు కూర, పొడి చేసుకునేందుకు భోజన ప్రియులు ఇష్టపడతారు. అయితే వినాయక చవితి తర్వాత వీటిని తినొద్దని చెబుతారు.

English summary
Boda kakarakaya has many uses for the body. By eating boda kakara BP and sugar are under control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X