ఈ కాకి చేసిన పనికి వారెవ్వా అనాల్సిందే.. వీడియో వైరల్ !

కాకి.. సాధారణంగా కనిపించే ఒక పక్షి. ఇన్నాళ్లు కాకుల గురించి.. వాటి తెలివితేటల గురించి ఎన్నో కథలు విని ఉంటాం. ఒక కాకి చనిపోతే వందల కాకులు అక్కడికి వచ్చి వాటి ఐక్యమత్యాన్ని నిరూపించుకుంటాయి. అలానే కాకి తెలివితేటల గురించి మనం చిన్ననాటి నుండి ఎన్నో కథలూ విన్నాం. అందులో అందరికీ బాగా తెలిసిన స్టోరీ ఒకటి ఉంది. "కాకి - మట్టి కుండ - నీరు" కథ. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో.. ఆ స్టోరీకి ఒక ఆధునిక రూపం లాంటిది అంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాకి - మట్టికుండ కథ..

ఒక వేసవికాలం రోజు ఓ కాకికి తీవ్రమైన దాహం వేధించింది. అది నీటికోసం ఎక్కడికక్కడ తిరిగింది. చివరికి ఒక మట్టికుండ కనిపించింది. కానీ దురదృష్టవశాత్తూ ఆ కుండలో నీరు చాలా తక్కువగా ఉంది. కాకి చొచ్చుకుని తాగలేకపోయింది. అయితే అది తక్షణంగా ఒక ఐడియా ఆలోచించింది. పక్కన ఉన్న చిన్న చిన్న రాళ్లను ఒక్కొటిగా తీసుకుని కుండలో వేస్తూ ఉండింది. క్రమంగా నీటి మట్టం పైకి వచ్చి, చివరికి కాకి తృప్తిగా నీరు తాగి ఎగిరిపోయింది.

crow-plans-to-break-walnut-and-video-goes-viral

ఇప్పుడు వైరల్ వీడియోలో..

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలోనూ అదే తరహా తెలివితేటలని ప్రదర్శించింది కాకి. కాకి మొదట ఇటుక సహాయంతో వాల్‌నట్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించడాన్ని చూడవచ్చు. కాకి తానుగా వాల్‌నట్‌ను విరగగొట్టలేకపోయినా, వాహనాల టైర్లు దానిని పగలగొట్టేలా చేయాలని ప్లాన్ చేసింది. వాల్‌నట్‌తో రోడ్డుపైకి చేరుకుంది. రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనాల టైర్ల కింద వాల్‌నట్స్‌ను పెట్టింది. ఓ కారు దాని పై నుంచి వెళ్తుంది. దీంతో ఆ వాల్‌నట్స్ ముక్కులగా మారింది. ఆ కాకి ఆనందంగా దాన్ని తీసుకుని తిని ఎగిరిపోయింది. ఈ విషయం అంతటినీ గమనిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

దీంతో కాకులు నిజంగా చాలా తెలివైనవని.. చిన్నప్పుడు వాటి తెలివితేటల గురించి విన్న కథలు.. ఇప్పుడు కళ్లారా చూశాక నమ్మక తప్పదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను లైక్ చేయడమే కాకుండా షేర్ కూడా చేస్తుండడంతో ఫుల్ గా వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+