వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ పిల్లలు గోర్లు కొరుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

|
Google Oneindia TeluguNews

కొంత మంది పిల్లలు గోర్లు కొరుకుంటుంటారు. టీవీ చూస్తూ లేదంటే హోం వర్క్ చేస్తూ గోర్లు కొరుకుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. పిల్లలు గోర్లు కొరుక్కోవడాన్ని 'అన్​కంట్రోల్డ్​ బైటింగ్' అంటారట. గోర్లు కొరికే అలవాటు ఉన్న పిల్లల్ని కొట్టడం, తిట్టడం వంటివి చెయ్యొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాచేస్తే వాళ్లు మరింత మొండిగా తయారయ్యే అవకాశం ఉందట.

వారానికొకసారి
గోర్లు కొరుక్కునే పిల్లలను తీసుకొని 'గోర్లు కొరకడం వల్ల మట్టి, క్రిములు వంటివి నోటిలోకి వెళ్తాయని చెప్పాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. గోర్ల దగ్గరి చర్మం దెబ్బతిని జ్వరం వస్తుందని, ఇంజెక్షన్లు ఇస్తారని చెప్పాలని వివరిస్తున్నారు. అలాగే పిల్లల కాలి వేళ్ల గోర్లను వారానికొకసారి చిన్నగా కత్తిరించాలి. దాంతో గోర్లు కొరకడానికి ట్రై చేసినప్పుడు నోటికి గోర్లు అందవు.

 Do this to prevent children from biting their nails

ఆట బొమ్మలు
చేతిలో ఏదైనా వస్తువు ఉంటే పిల్లలు గోర్లు కొరకడం మానేస్తారట. అందుకని వాళ్లు బోర్​ గా ఫీలయినప్పుడు చేతిలో పట్టుకుని ఆడుకునే ఫిడ్జెట్ ఆట బొమ్మలు ఇవ్వాలట. ముఖ్యంగా పిల్లలను ఎప్పుడు ఇంట్లో ఉంచకూడదు. బయట కాసేపు తిప్పాలి. గోర్లు కొరకుతున్నప్పుడు పిల్లల బిహేవియర్​ని గమనించాలి. వారితో మాట్లడే ప్రయత్నం చేయాలి.

English summary
Some children bite their nails. This is not a good habit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X