Fenugreek Benefits: మీకు షుగర్ ఉందా.. అయితే మెంతి తీసుకోండి..!
మనం తీసుకునే ఆహారంలో మెంతి ఉండేలా చూసుకోవాలి. డయాబెటిస్‌లో మెంతి ఆకుల కంటే మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ఈ గింజలు రక్తంలో గ్లూకోజ్‌ను స్థాయిలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నాయి. అందుకే మధుమేహంతో బాధపడుతున్నవారు మెంతి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు మెంతులు వేడి నీటిలో రాత్రంతా నానబెట్టి.. ఉదయం వడకట్టిన తర్వాత తాగితే మంచి ఫలితాలు ఉంటాయట.

మెంతి ఆకులు
ఉదయం పూట ఈ నీటిని తాగితే శరీరంలో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు మెంతి పొడిని కూడా తీసుకోవచ్చు.. నీటిని వేడి చేసి అందులో రెండు చెంచాల పొడిని వేసి మరిగించి తాగాతే మధుమేహం త్వరలో నియంత్రణలోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలట.

పోషకాలు
మెంతికూర తినడం వల్ల నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా మెంతి తగ్గిస్తుందట. స్త్రీ పురుషుల లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుందట. మెంతి ఆకుల్లో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి.

ఫైబర్
ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, బి6, సి, విటమిన్ కె వంటి అనేక రకాల పోషకాలు మెంతిలో పుష్కలంగా ఉంటాయట. ఇందులో మధుమేహంపై ప్రభావం చూపే కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications