వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Guava: షుగర్ ఉన్నవారు జామ పండు తినొచ్చా..

|
Google Oneindia TeluguNews

పండ్లలో జామ పండు ఆరోగ్యానికి చాలా మంచింది. జామ మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. జామ మొక్కలు మిర్టిల్‌ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలుగా నిపుణులు చెబుతున్నారు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా మొక్కలు లభ్యమవుతాయట. జామలోని ఫైబర్ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. జమా తినడం వల్ల గ్లూకోజ్ క్రమంగా విడుదల కావడం ద్వారా జీర్ణక్రియను పెరుగుతుంది.

విటమిన్ సి
జామ శరీర బరువును కూడా నియంత్రిస్తుంది. మధు మేహవ్యాధిగ్రస్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వీటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. జామ కాయల్లో అధిక విటమిన్ సి ఉంటుంది. దీని తినడం వల్ల డయాబెటిస్‌తోపాటు దాని ముడిపడి ఉన్న ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. జామ కాయల్లో పోటాషియం సమృద్ధిగా ఉంటుంది.

Guava fruit is very good for health

జామ ఆకు
జామ పండు ఆకులో ఉండే ఆంటీబాక్టీరియల్ గుణాల కారణంగా చర్మానికి సంబంచిన వివిధ సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. జామ పండ్లే కాకుండా జామ ఆకులు కూడా శరీరానికి మంచివట. ఒక పరిశోధన ప్రకారం ప్రతి రోజు 100 గ్రాముల జామ చెట్టు ఆకుల డికాషన్ తాగటం వల్ల లంగ్ క్యాన్సర్ రాదట. జామ ఆకులు చర్మానికి కాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంచిన సమస్యలకు కూడా సహాయపడుతుంది.
English summary
Among the fruits, guava fruit is very good for health. Food is digested quickly by eating guava. Guava nuts are rich in potassium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X