Garlic Benefits: వెల్లుల్లి ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు..
మనం చేసుకునే వంటల్లో దాదాపు అన్నింటిలో వెల్లుల్లి వేసుకుంటాం. వెల్లుల్లి వేస్తే ఆ రుచి వేరేలా ఉంటుంది. అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లి తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కారణం వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థమేనని వివరిస్తున్నారు.

ఆయుర్వేదం
అందుకే శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి సాటి లేదట. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి, శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయట. ఆయుర్వేదంలోనూ వెల్లుల్లిని కొన్ని ఏండ్ల నుంచి రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.

యాంటీ క్లాటింగ్
ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో అల్జీమర్స్‌ను తగ్గించే లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల మెదడు పనితీరుపై ప్రభావం చూపించే అల్జీమర్స్, డిమెన్షియా(జ్ఞాపకశక్తి తగ్గిపోవడం) వంటి వ్యాధుల బెడద ఉండదట.

గుండె జబ్బు
గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి.. గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడుతున్న వారైతే వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం వల్ల చక్కటి పరిష్కారం దొరుకుతుందట. కానీ వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకోబోయే వారు మాత్రం వెల్లుల్లి వినియోగం విషయంలో వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

వారు తినొద్దు
అయితే వెల్లుల్లి కొంతమందికి మంచిది కాదు.. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించే మందులు తీసుకునే వారు, రక్తస్రావం అయ్యే వారు వెల్లుల్లి తీసుకోకపోవడమే మంచిదట. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 12 ట్రయల్స్ లో పాల్గొన్న 553 మంది రక్తపోటును వెల్లుల్లి సమర్థవంతంగా నియంత్రించిందని తేలిందట.












Click it and Unblock the Notifications