యోగాతో ఆరోగ్యం, ఆనందం.. ఆద్యుడు పరమశివుడే, విశిష్టత..
యోగా.. సాక్షాత్ పరమశివుడు ఆద్యుడని పురాణాలు చెబుతున్నాయి. యోగా చేయడం వల్ల అనారోగ్య బారినపడరని, ఆరోగ్యం ఉంటారని పూర్వీకులు చెబుతున్నారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో యోగా ఒక భాగం. కానీ 21వ శతాబ్దంలో మళ్లీ యోగాకు క్రేజీ ఏర్పడింది. 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి యోగా డే ను భారతదేశంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం కరోనా వైరస్ వల్ల ఆన్ లైన్ యోగాకే పరిమితమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, యోగా గురువు రాందేవ్ బాబా సహా పలువురు ప్రముఖులు ఆన్ లైన్‌లో యోగా చేసి..జాతీకి ఉపదేశం ఇస్తున్నారు.

6.30 గంటలకు మోడీ సందేశం..
2020 జూన్ 21వ తేదీన యోగా ఎట్ హోం అండ్ యోగా విత్ ఫ్యామిలీ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. అందరూ ఇంట్లోని ఉండి యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రధాని మోదీ దేశ ప్రజలకు సందేశం ఇస్తారని ఆయుష్ మంత్రిత్వశాఖ పేర్కొన్నది.

శివుడు ఆద్యుడు
యోగాకు ఆద్యులు పరమశివుడని పురాణాలు చెబుతున్నాయి. యోగా అనే పదం సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. యోగా అంటే కలయిక లేదా సంయోగం అని అర్థం. మానవుని శారీరక, బౌద్ధిక, ఆధ్యాత్మిక కోణాలను సమగ్రంగా సంయోగపరచి స్థిరమైన, సంతృప్తికరమైన, ఉత్పాదక జీవితాన్ని సాధించేందుకు, ఆధ్యాత్మికంగా ఈశ్వరునితో ఏకమయ్యేందుకు దోహదం చేసేదే యోగ అని సాధువులు చెబుతుంటారు.

యోగుల సంభాషణలు
ప్రాచీన గ్రంథాలన్నింటిలో యోగా ఉంటుంది. యోగుల సంభాషణల నుంచి పుట్టిందే యోగ అనే వాదనా కూడా ఉంది. పురాణాల ప్రకారం యోగా విద్యను శివుడు తన పత్ని పా ర్వతికి ముందుగా వివరించి అనంతరం సమాజానికి వివరించాడని పూర్వీకులు చెబుతుంటారు. పతంజలి యోగ సూత్రాలు ఆధ్యాత్మికత లోతులను స్పృశిస్తాయని కూడా వివరిస్తారు.

భంగిమ
సంస్కృతంలో ఆసనమనే పదానికి అర్థం భంగిమ.. ఆసనాలు ఎనభై నాలుగు ఉన్నాయి. ఏ ఆసనం ప్రత్యేకత దానికి ఉంది. ప్రతి దానికీ పేరు, చేయాల్సిన పద్ధతి ఉన్నాయి. యోగ ద్వారా వ్యక్తి ప్రశాంతత, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని సాధించవచ్చని ఆధునిక శాస్తవ్రేత్తలు కూడా అంగీకరిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications