వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: పండుగ పిండివంటలతో కడుపు ఉబ్బరమా? అయితే తగ్గేందుకు చిట్కాలివే!!

|
Google Oneindia TeluguNews

పండుగలు వచ్చాయంటే చాలు పిండివంటలతో పాటు, రకరకాల ఆహార పదార్థాలను తిని అజీర్ణ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కడుపు ఉబ్బరంగా ఉందని తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకపక్క తినాలనే కోరిక , ఇంకొక పక్క తినలేని పరిస్థితి వారిని ఇబ్బందికి గురిచేస్తుంది. పండుగల సమయంలో రకరకాల పిండి వంటలను తిని కడుపు మొత్తం పాడైన తర్వాత మళ్లీ కడుపుని సరైన ట్రాక్ లో పెట్టడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

కడుపు ఉబ్బరానికి కారణాలు ఇవే

కడుపు ఉబ్బరానికి కారణాలు ఇవే

సరైన జీవన శైలి లేకపోవటం, తీసుకుంటున్న ఆహారానికి తగ్గట్టు శారీరక వ్యాయామం చెయ్యకపోవటం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు, సరిగా నిద్ర పోకపోవటం, విపరీతంగా మసాలాల ఆహారం, ఆయిల్ ఫుడ్స్ తినటం వంటి అనేక కారణాలు కడుపు ఉబ్బరానికి కారణం అవుతాయి. కడుపు ఉబ్బరంతో బాధ పడేవారు కొద్దిగా తిన్నా చాలా హెవీగా ఫీల్ అవుతారు. విపరీతమైన కడుపు నొప్పి, శ్వాస ఆడనట్టు ఆయాసంగా ఉండటం వంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి.

కడుపు ఉబ్బరం తగ్గాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

కడుపు ఉబ్బరం తగ్గాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

అయితే కడుపు ఉబ్బరం తగ్గాలంటే ముందు తినకూడని ఆహార పదార్థాలను గురించి ఆహార నిపుణులు ఈ విషయాలను చెబుతున్నారు. కడుపు ఉబ్బరంగా ఉండి ఇబ్బంది పడుతున్న వారు కడుపు ఉబ్బరం తగ్గాలంటే సోడియం, లాక్టోజ్, ఫ్రక్టోజ్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినకూడదని సూచిస్తున్నారు. ఇక మసాలా కూరలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. పొరపాటున కూడా ఆల్కహాల్ ముట్టుకోకూడదని చెబుతున్నారు.

కడుపు ఉబ్బరం తగ్గాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి

కడుపు ఉబ్బరం తగ్గాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి

పాలతో తయారుచేసిన పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని చెబుతున్నారు . క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరలు తినకూడదని చెబుతున్నారు. వేపుళ్లకు దూరంగా ఉండాలని, ఐస్ క్రీమ్స్ తినకూడదని హెచ్చరిస్తున్నారు. కొబ్బరితో తయారుచేసిన పదార్థాలకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం, హడావిడిగా భోజనం చేయడం కూడా చేయకూడదని చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువగా ఆహారం తీసుకోవటం మంచిది కాదని చెప్తున్నారు.

కడుపు ఉబ్బరం తగ్గాలంటే ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండండి

కడుపు ఉబ్బరం తగ్గాలంటే ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండండి

కాఫీ, టీలు ఎక్కువగా తాగకూడదని హెచ్చరిస్తున్నారు. పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే నారింజ, బత్తాయి ఇలాంటి సిట్రస్ ఎక్కువగా ఉండే పండ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగ్గాలని చెప్తున్నారు. ఇక వీలైనంత వ్యాయామం చెయ్యాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Health tips: సంక్రాంతి పిండివంటలు అతిగా లాగిస్తున్నారా? అయితే ముందీ విషయం తెలుసుకోండి!!Health tips: సంక్రాంతి పిండివంటలు అతిగా లాగిస్తున్నారా? అయితే ముందీ విషయం తెలుసుకోండి!!

English summary
Apart from dietary habits, there are many reasons for bloating stomach and gastric problems. If the stomach is bloated then these food items should not be consumed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X