Egg Side Effects: ఆ వ్యాధులు ఉన్నవారు గుడ్డు అస్సలు తినొద్దు..!

పోషక ఆహారాల్లో గుడ్డు ఒకటి. అందుకే రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుందట. దీని నుంచి అతని శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే ఇది మన జీవన శైలిపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీకు ఏ చిన్న అనారోగ్య సమస్యలు కూడా లేనట్టైతే మూడు గుడ్లను తినొచ్చట. రోజూ రెండుకంటే ఎక్కువ గుడ్లు తినే వాళ్లు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తేనే మంచిదట. ఎందుకంటే వ్యాయామం చేసే వారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇవి గుడ్ల నుంచే ఎక్కువగా లభిస్తుంది.

పచ్చసొన

పచ్చసొన

ముఖ్యంగా గుడ్డు లోపల తెలుపు రంగులో ఉండే పచ్చసొనలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ బి2 పుష్కలంగా లభిస్తుంది. గుడ్లలోని ప్రోటీన్ రక్తపోటును తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది. అంతేకాక, దీనిలో విటమిన్ డి(vitamin D), బి6, బి12, జింక్, ఇనుము(iron) పుష్కలంగా ఉంటాయట. గుడ్లలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం గుడ్లకు దూరంగా ఉండాలి. ఎవరు తినకూడదు, కారణాలేంటనేది తెలుసుకుందాం..

కిడ్ని సంబంధిత సమస్యలు

కిడ్ని సంబంధిత సమస్యలు


కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు గుడ్డు తినకూడదు. ఎందుకంటే గుడ్లు తినడం వల్ల కిడ్ని సంబంధిత సమస్యలు మరింతగా పెరుగుతాయి. కిడ్నీ వ్యాధిగ్రస్థులు గుడ్డుకు దూరంగా ఉండాలి. డయాబెటిస్ రోగులు కూడా గుడ్లు తినకూడదట. మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుడ్డులో ఎల్లో భాగం ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదు. వైట్ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు ఉన్నవాళ్లు గుడ్డు తినకుండా ఉండటమే మంచిదట. ఎందుకంటే గుడ్లు తినడం వల్ల శరీర బరువు వేగంగా పెరిగిపోతుంది. గుడ్లలో ఉండే ప్రోటీన్లు బరువు పెరిగేలా చేస్తాయి.

 డయేరియా

డయేరియా


ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుడ్లను మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం ప్రమాదంలో పడతారు. రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డును తింటే చాలు. పరిమితికి మించి తింటే మీరు డయేరియా బారిన పడే అవకాశం ఉందట. గుడ్లను మోతాదుకు మించి తింటే.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందట. ఇది మలబద్దకానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+