Side Effects Of Papaya: బొప్పాయ తింటున్నారా.. అయితే జాగ్రత్త..
బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయిలో మిటమిన్ సీ ఉంటుంది. అలాగే ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెయింటెయిన్ చేయడంలో బొప్పాయి ఉపయోగపడుతుంది. బొప్పాయిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. క్యాన్సర్స్‌తో బాధపడుతున్న వారు తప్పకుండా బొప్పాయి రసాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మోతాదుకు మించి..
అయితే మోతాదుకు మించి బొప్పాయి తీసుకుంటే నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలకు బొప్పాయి హానికరం. బొప్పాయి గింజలు, వేర్లు, ఆకుల కషాయం పిండానికి హాని కలిగిస్తాయని చాలా మంది ఆరోగ్య నిపుణులు గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదని సలహా ఇస్తారు

ఫైబర్ కంటెంట్..
బొప్పాయిలో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంది. మలబద్ధకం ఉన్నవారికి ఇది గొప్పది అయినప్పటికీ, దాని అధిక వినియోగం కడుపు నొప్పికి దారితీస్తుంది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, బొప్పాయి రక్తం పల్చపడడానికి ఇచ్చిన మందులతో సంకర్షణ చెందుతుంది, ఇది సులభంగా రక్తస్రావం, గాయాలకు దారితీస్తుంది.

వాటితో కలిపి తినొద్దు..
అలాగే బొప్పాయితో కలిపి ఇతర పండ్లను తినొద్దు. తరచుగా చాలా మంది సిట్రస్ పండ్లు, బొప్పాయిని ఫ్రూట్ చాట్‌లో కలిపి తింటుంటారు. ఇలా కూడా తినకూడదు. అరగంట గ్యాప్ తీసుకోవాలి. అవి కడుపు లోపల ఒక రకమైన రసాయన ప్రతిచర్యను చేస్తుంది. చాలా సార్లు ఆరోగ్యంగా ఉండటానికి లేదా ఫిట్‌గా ఉండటానికి కొన్ని రకాల పదార్థాలను కలిపి తింటుంటారు.












Click it and Unblock the Notifications