Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Dandruff: చలికాలం చుండ్రు సమస్య వేధిస్తుందా.. అయితే ఈ పని చేయండి చాలు..!

చలి కాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు వస్తుంటాయి. అందుకే ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో చుండ్రు ఉన్నవారికి మరింత ఎక్కువ అవుతుంది. దీని వల్ల తరచూ తల దురద పెట్టడం, జిడ్డు పేరుకుపోవడం వంటి జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలకు కొన్ని చిట్కాలను ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయ

ఉల్లిపాయ


ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు వాటర్ తో సహా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

భృంగరాజ్ పౌడర్

భృంగరాజ్ పౌడర్


ఇలా గ్రైడ్ చేసుకున్న మిశ్రమంలో వ‌న్ టేబుల్ స్పూన్ భృంగరాజ్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

 టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్


చుండ్రును అరికట్టడంలో టీ ట్రీ ఆయిల్​ ఎంతో ఉపయోగపడుతుంది. సొరియాసిస్​, మొటిమలు వంటి సమస్యలను నయం చేయడంలో మేటి అయిన ఈ ఆయిల్​ ను చుండ్రు సమస్యలను తగ్గించేందుకు ఉపయోగించవచ్చు. ఒక వేళ మీది సున్నితమైన చర్మం అయితే ఆయిల్‌ వల్ల చర్మం సెన్సిటివ్​ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి దీన్ని నేరుగా మీ చర్మానికి అప్లై చేసే ముందు కొన్ని చుక్కల కొబ్బరి నూనెను టీ ట్రీ ఆయిల్ లో కలుపుకోవడం మంచిది.

 అలోవెరా

అలోవెరా


స్కిన్​ ఆయింట్మెంట్స్​, స్కిన్​ కేర్​ ప్రాడక్ట్స్​లో ఉపయోగించే ఓ కీలకమైన పదార్థం అలోవెరా. ఇది సాధారణంగా ఇంటి చిట్కాగా కూడా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాలిన గాయాలు, సొరియాసిస్​ లాంటి సమస్యలను అరికట్టడమే కాకుండా దానికున్న యాంటీ బాక్టీరియల్​ గుణంతో చుండ్రుకు చెక్​ పెట్టొచ్చు.

 యాపిల్​ సిడార్​ వెనిగర్

యాపిల్​ సిడార్​ వెనిగర్


బరువు తగ్గేందుకు దోహదపడే యాపిల్​ సిడార్​ వెనిగర్​ చుండ్రు సమస్యను అరికట్టడంలోనూ ఉపయోగపడుతుంది. వెనిగర్​ కు ఉన్న ఆమ్లత్వంతో తలపై ఉన్న మృత కణాలను తొలగించవచ్చు. అలాగే చర్మంలోని పీహెచ్​ను నిలువ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా వెల్లుల్లిని మెత్తగా గ్రైడ్‌ చేసుకుని రసాన్ని వేరు చెయ్యాలి. తర్వాత వెల్లుల్లి రసంలో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి. దీన్ని తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తల స్నానం చెయాలి.

 బేకింగ్​ సోడా

బేకింగ్​ సోడా


మన ఇంట్లో విరివిగా దొరికే బేకింగ్​ సోడాతోనూ డాండ్రఫ్​ను తొలగించవచ్చట. యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్న ఈ సోడా మృత కణాలను తొలగించడమే కాకుండా దురదను కూడా తగ్గిస్తుందట. అరకప్పు పెరుగులో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత షాంపుతో తల స్నానం చేసుకోవాలి.

 కొబ్బరి నూనె

కొబ్బరి నూనె


వంటతో పాటు, తలకు పెట్టుకొనేందుకు ఉపయోగపడే కొబ్బరి నూనెను చాలా మంది వంటింటి చిట్కాగా ఉపయోగిస్తుంటారు. యాంటీమైక్రోబయల్ లక్షణాలు గల ఈ నూనె చర్మాన్ని హైడ్రేట్​ చేయడమే కాకుండా జుట్టుకు ఉన్న పొడిదనాన్ని నివారిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+