ఈ దేశాల్లో అసలు రాత్రి అవదని ..మీకు తెలుసా..!
సాధారణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో 24 గంటలు ఉంటాయి. అందులో 12 గంటలు పగలు, మరో 12 గంటలు రాత్రి. దాదాపు అన్ని దేశాల్లో పరిస్థితి ఇలానే ఉంటుంది.భారతదేశంలో కూడా 12 గంటలు పగలుండగా, మరో 12 గంటలు రాత్రి ఉంటుంది.కాని కొన్ని దేశాల్లో పగటి సమయానికి , రాత్రి సమయానికి చాలా వ్యత్యాసాలు నెలకొన్నాయి. కొన్ని దేశాల్లో పగలు ఎక్కువ సమయం ఉండగా , మరి కొన్ని దేశాల్లో రాత్రి సమయం ఎక్కువుగా ఉంటుంది. అయితే వీటిల్లో పెద్దగా తేడా ఏమీ కనిపించదు.
కాని కొన్ని దేశాల్లో రాత్రి కన్నా పగలే ఎక్కువుగా ఉంటుంది. భూమిపై చీకటి కొన్ని గంటలు మాత్రమే ఉండే దేశాలు కొన్ని ఉన్నాయి. ఆయా దేశాల్లో దాదాపు 20 గంటలు పగలే ఉంటుంది. అంటే ఈ దేశాల్లో 20 గంటలు సూర్యుడే దర్శనిమిస్తాడు. పగలు ఎక్కువుగా ఉండే దేశాలు లిస్ట్‌ను ఓసారి పరిశీలిద్దాం. ఈ జాబితాలో మూడో స్థానంలో కెనడా దేశం ఉంది. కెనడాలో వేసవి కాల సమయంలో దాదాపు 50 రోజుల పాటు పగలే ఉంటుంది. కేవలం నాలుగు గంటలు మాత్రమే అక్కడ చీకటి పడుతుంది.

రాత్రి సమయం అతి తక్కువుగా ఉండే జాబితాలో ఫిన్‌లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ మే నుంచి జూలై వరకూ పగలే ఉంటుంది. అంటే ఫిన్‌లాండ్‌లో దాదాపు 73 రోజులపాటు పూర్తిగా సూర్యూడే కనిపిస్తాడు. అతి తక్కువ సమయం మాత్రమే ఈ దేశంలో చంద్రుడు కనిపిస్తాడు. ఇక రాత్రి అవని దేశాల జాబితాలో మొదటి స్థానంలో నార్వే నిలిచింది. ఈ దేశంలో ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకూ సుర్యుడే దర్శనిమిస్తాడు. అంటే 76 రోజుల పాటు ఇక్కడ చీకటిని చూడలేము.అంటే ఈ మూడు దేశాల్లో కొన్ని గంటల మాత్రమే చీకటి పడుతుందన్న మాట.












Click it and Unblock the Notifications