Sleep Problem: నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ పని చేయండి..
ఈ మధ్య చాలా మందికి రాత్రి పూట నిద్ర పట్టడం లేదు. చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ నిద్ర లేకుంటే చాలా సమస్యలు వస్తాయి. మనిషి రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచించారు. చాలా మంది తమకు రాత్రి నిద్ర పట్టడం లేదని చెబుతారు. పొట్టలో ఖాళీ లేకుండా తినడం, ఒత్తిడి, ఆందోళన వంటి ఇతర కారణాల వల్ల కూడా నిద్రపోవడానికి ఇబ్బంది కలుతుందట. మనిషి ప్రశాంతంగా నిద్రపోవాలంటే కొన్ని పదార్థాలు తీసుకోవాలి.

పాలు
గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగాలి. ఇందులోని అమైనో ఆమ్లాలు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. హాయిగా నిద్రపోవడానికి కూడా సహాయపడతాయి. ముఖ్యంగా వృద్ధులు ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలను తాగాలని నిపుణులు సూచుస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ మీ జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాదు.. మీరు హాయిగా నిద్రపోవడానికి కూడా సహాయపడతాయట.

అల్లం
ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని తులసి ఆకులను నీటిలో బాగా మరిగిస్తే.. తులసి, అల్లం నీరు రెడీ అయినట్టే. ఈ పానీయాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ కు ఎలాంటి అంతరాయం ఎర్పడదు. అలాగే ఈ పానీయం మీరు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. రాత్రి పూట పడుకునే ముందు మొబైల్, టీవీ ఎక్కువగా చేస్తే నిద్ర పట్టకపొవచ్చు.

జంక్ ఫుడ్, కాఫీ
రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. జంక్ ఫుడ్ తినొద్దు. కాఫీ తాగకూడదు. ఇందులో ఉండే కెఫిన్ మెదడును చురుగ్గా చేస్తుంది. దీంతో నిద్ర అసలే పట్టదు. ఇక జంక్ ఫుడ్ రాత్రిళ్లు సరిగ్గా అరగదు. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిళ్లు వీటి జోలికి వెల్లకపోవడమే మంచిదనిట.












Click it and Unblock the Notifications