Hair Fall: జుట్టు రాలిపోతుందా.. అయితే ఈ పని చేయండి..
ప్రస్తుత జీవనం విధానంతో చాలా మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో జుట్టు ఉడిపోవడం ఒక్కటి. చాలా మందికి ఒత్తైన జుట్టు ఉండాలని కోరుకుంటున్నారు.అయితే ప్రస్తుతం చాలా మందికి జుట్టు ఉడిపోతోంది.ఒక వేళ జట్టు ఉన్నా అది త్వరగా తెల్లగా మారుతోంది. అందుకే చాలా జట్టు ఉడిపోకుండా చాలా షాంపులు, రకరకాల మందులు వాడుతుంటారు.

గింజలు
జుట్టు ఉడిపోకుండా బలంగా ఉండడానికి మంచి ఆహారం కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మనం తీసుకునే ఆహార పదార్థాల్లో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. వీటి వల్ల జట్టు ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో మన ఆరోగ్యాన్ని రక్షించే పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు

బచ్చలి కూర
రోజూ గుప్పెడు గింజలను తింటే జుట్టు బలంగా తయారవుతుందట. అలాగే బాదం పప్పులను రోజూ కొద్ది మొత్తంలో తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందట. బచ్చలి కూర తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగే అవకాశం ఉంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, పొటాషియం, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.

బియ్యం కడిగిన నీళ్లు
జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి గుడ్డు కూడా తీసుకుంటే మంచిదట. గుడ్డులో ఉండే ప్రోటీన్లు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. అంతేకాదు గుడ్లు హెయిర్ ఫాల్ సమస్యను కూడా పోగొడుతాయట. మంచి ఆహారంతో పాటు కొన్ని చిట్కాలు కూడా జట్టు రాలిపోకుండా చేస్తాయి. బియ్యం కడిగిన నీళ్లను చాలామంది పడబోస్తుంటారు. అయితే ఆ నీళ్లలో జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications