వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీగా పెరిగిన బంగారం ధరలు, రికార్డ్ ధరతో చాలా తక్కువ

|
Google Oneindia TeluguNews

బంగారం ధరలు గురువారం (ఏప్రిల్ 23) పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు స్థిరంగా లేవు. ఈ రోజు ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.61 శాతం లేదా రూ.283 పెరిగి రూ.46,450 పలికింది.వెండి కిలో ధర 1.54 శాతం లేదా రూ.640 పెరిగి రూ.42,326కు చేరుకుంది. ధరలు గత వారం రూ.47,000 దాటి రికార్డ్ ధరకు చేరుకున్నాయి. దాంతో పోలిస్తే రూ.1500 వరకు తక్కువ ఉంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రిటైల్ స్పాట్ గోల్డ్ మార్కెట్లు క్లోజ్ ఉన్నాయి.

మైనస్‌లోకి చమురు కాంట్రాక్ట్ ధర, ఇండియాలో రగడ, హైకోర్టుకు బ్రోకరేజీ సంస్థలు

భారీగా పెరిగిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర

గురువారం బంగారం ధరలు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల రూ.680 పెరిగి రూ.44,780కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.650 పెరిగి రూ.41,050కి చేరుకుంది. పరిశ్రమ యూనియ్లు, నాణెపు తయారీదారుల నుండి డిమాండ్ పడిపోవడంతో వెండి ధర మాత్రం పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

ఈక్విటీ మార్కెట్లలో స్థిరత్వం లేకపోవడం, చమురు ధరలు భారీగా పడిపోవడంతో బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.2 శాతం పెరిగి 1,710.23 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్‌లో 1.9 శాతం పెరిగింది. అదే సమయంలో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా 0.2 శాతం తగ్గి 1,735.30 డాలర్లకు తగ్గింది.

రికార్డ్ ధర నుండి తగ్గుదల

రికార్డ్ ధర నుండి తగ్గుదల

గత వారం రోజులుగా అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలోని పరిస్థితుల కారణంగా బంగారం ధరలు పెరుగుతూ, తరుగుతున్నాయి. ఈ వారంలో బంగారం ధర గరిష్టం 1,719.38 పలికింది. ఈ రోజు అది 1,709.36కు చేరుకుంది. వరల్డ్ లార్జెస్ట్ గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రెడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం 0.9 శాతం పెరిగి 1,042.46 టన్నులకు చేరుకుంది.

English summary
Gold futures were up 0.61 per cent or Rs 283 to Rs 46,450 per 10 grams. Silver futures added 1.54 per cent or Rs 640 to Rs 42,326 per kg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X