గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందుబాబు ల‌కు ల‌క్కీఛాన్స్‌: నిరుద్యోగుల‌కు స‌ద‌వ‌కాశం: ఏపిలో కొత్త ఒర‌వ‌డి..!

|
Google Oneindia TeluguNews

మందుబాబులు మ‌ద్యం సేవిస్తే డ్రైవింగ్ చేయ‌లేరు. చేస్తే పోలీసుల చేతికి చిక్కాల్సిందే. ఇక‌, వారికి కొత్త అవ‌కాశం. అదే విధంగా.. నిరుద్యోగుల‌కు స‌ద‌వ‌కాశం. ఏపి రాజధాని గుంటూరు లో కొత్త అవ‌కాశాల పుంత‌లు తొక్కుతున్నాయి. మ‌హిళ‌ల కోసం త్వ‌ర‌లో ప్ర‌త్యేక సేవీలు అందించ‌టానికి సిద్దం అవుతున్నారు...

గుంటూరు లో బైక్ ట్యాక్సీలు..

గుంటూరు లో బైక్ ట్యాక్సీలు..

మహానగరాలకే పరిమితమైన ఈ బైక్‌ ట్యాక్సీలు ఇప్పుడు విజయవాడ, గుంటూరుల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి.
దేశంలోని 32 నగరాల్లో ఈ సేవలందిస్తున్న ర్యాపిడో, ఓలా సంస్థలు ప్రస్తుతం నగరంలో వీటిని ప్రారంభించాయి. ఓలా నెల రోజులకు పైగా నే సేవలందిస్తుండగా... కొద్దిరోజుల క్రితమే ర్యాపిడో సేవలు ప్రారంభించింది. ఈ రెండు యాప్‌ల ద్వారా సేవలందిస్తాయి. యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని సేవలుపొందవచ్చు. ర్యాపిడో నగరంలో కనీస ధరలు మూడు కిలోమీటర్లకు రూ.15గా ఆఫర్‌ ఇచ్చారు. ఆ పై ప్రతి కిలోమీటరుకు రూ.5 చొప్పున చెల్లించాలి. వీటిలో ఆఫర్‌ను బట్టి రేట్లు మారుతున్నాయి. యాప్‌లో ఆర్డర్‌ చెప్పగానే ఆఫర్‌లు కూడా చెప్తున్నారు. గుంటూరు నగరంతో పాటు 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికైనా ఈ బైక్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

మందుబాబులకు లక్కీఛాన్స్‌

మందుబాబులకు లక్కీఛాన్స్‌

బైక్ ట్యాక్సీల‌ సేవలు ఇప్పటి వరకు అంది స్తున్న నగరాలలో ఎక్కువగా వినియోగించుకుంటున్న వారు మద్యం ప్రి యులే. మద్యం సేవించిన తరువాత ప్రయాణించడానికి వాహనాల కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి రావడం. లేదా సొంతగా డ్రైవింగ్‌ చేస్తే పోలీసు జరిమానాలు ఎక్కువకావడంతో మహాన గరాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తు న్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ఇకపై గుంటూరులో కూడా మందుబాబులు వీటిని విరివిగా ఉపయోగిస్తారని భావి స్తున్నా రు. బైక్‌పై వెళితే ఎక్కడా అనుమానాలు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో దీనిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముందు రైడ‌ర్ ఉండ‌టంతో పోలీసుల నుండి త‌ప్పించుకొనే అవ‌కాశం ఉంటుంది. గుంటూరు లాంటి మినీ న‌గ‌రాల్లో ఇది ఉప‌యోగ క‌రంగా ఉంటుంది.

నిరుద్యోగుల‌కు స‌ద‌వకాశం

నిరుద్యోగుల‌కు స‌ద‌వకాశం

సొంత ద్విచక్ర వాహనం, లైసెన్సు, ఫోన్‌, నగరంపై అవగాహన ఉంటే నిరుద్యోగుల‌కు ఇది మంచి అవకాశం. ర్యాపిడో కంపెనీ వారం రోజుల నుంచి నియామకాలు చేపట్టింది. ఈ అర్హతలు ఉండి అమరావతి రోడ్డులోని వారి కార్యాలయంలో సంప్రదిస్తే నియామకాలు తీసుకుంటున్నారు. కనీసం నిరుద్యోగ యువకుడు నెలకు రూ.15 నుంచి రూ.18వేలు సం పాదించుకునే అవకాశం కల్పిస్తా మని చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభించిన చోట్ల దీనికి మించిన సంపాదన ఉంటుం దని, కనీసం రూ.15వేలు ఉంటుందని చెబుతున్నారు. ఆసక్తిగల వారు చేరిన తరువాత మరొకరిని చేరిస్తే రూ.500 గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ఇక‌, మ‌హిళా రైడ‌ర్ల‌కు అవ‌కాశం ఇస్తున్నారు. వారు ఉద‌యం ఆరు గంట‌ల నుండి సాయం త్రం ఆరు గంట‌ల వ‌ర‌కు ప‌ని చేయాల్సి ఉంటుంది. ఇక‌, మ‌హిళా క‌స్ట‌మ‌ర్ల కోసం యాప్ లో ప్ర‌త్యేక ర‌క్ష‌న స‌దుపాయా లు క‌ల్పించారు.

English summary
Bike Taxi started in Ap Capital Amaravati. Two main companies started services in Guntur city. It may help for un employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X