Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కీర్తిని మించిన భార్గవి.. ఆస్తి కోసం తల్లినే... భర్త, ప్రియుడు కూడా..

వయసుకొచ్చిన పిల్లల్లో మార్పులొస్తున్నాయి. అవి మంచివి అయితే ఫరవాలేదు. కానీ చెడు ఆలోచనలు, చెడు దృష్టితో ఉంటున్నాయి. అవును హయత్‌నగర్‌లో కలకలం రేపిన రజిత హత్యకేసులో కూతురు కీర్తి నిందితురాలు. ఇక గుంటూరులో అలపాటి లక్ష్మీ హత్య కేసులో కూడా కూతురే నిందితురాలు కావడం విశేషం. ఈ రెండు కేసులకు సంబంధం లేకపోయినా.. తాము రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్దచేసిన తల్లులనే కర్కశ కూతుళ్లు మట్టుబెట్టారు.

ఇదీ విషయం

ఇదీ విషయం

గుంటూరులో దారుణం జరిగింది. ఈ నెల మొదటివారంలో అలపాటి లక్ష్మీ అనే వివాహిత చనిపోయింది. అయితే ఆమె చనిపోయిన తర్వాత కేసు వద్దని ఆమె కూతురు భార్గవి పోలీసులతో అనడంతో ఏం జరిగింది అని ఆరాతీయడం ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక చూసి పోలీసులు నిర్థాంతపోయారు. లక్ష్మీది సహజమరణం కాదని వైద్యులు ధ్రవీకరించారు. దీంతో ఎవరూ చంపారు అనే కోణంలో దర్యాప్తు చేశారు. లక్ష్మీ భర్త రెండేళ్ల కింద చనిపోగా.. కుమారుడు చిన్నతనంలో చనిపోయాడు. ఈ క్రమంలో కూతురు భార్గవినే పోలీసులు అనుమానించారు.

తీగ లాగితే..

తీగ లాగితే..

లక్ష్మీ హత్యకు సంబంధించి భార్గవిని విచారించారు. తమదైనశైలిలో ఎంక్వైరీ చేస్తే నిజం బయటపడింది. తన తల్లిని తానే చంపినట్టు భార్గవి అంగీకరించింది. ఎందుకు హతమార్చావని అడిగితే ఆస్తి కోసమేనని చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఆస్తి కోసం సొంత తల్లిని చంపడం ఏంటీ అని ఆలోచించారు. తండ్రి, తమ్ముడు లేకపోవడంతో ఆస్తి తనకే దక్కతుందనే సోయి కూడా భార్గవికి లేకపోయింది. పేగు తెంచుకొని బిడ్డ యమపాశమవుతుందని లక్ష్మీ కలలో కూడా అనుకోలేదు. కానీ కూతురు భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దారుణానికి ఒడిగట్టింది.

 పేగుబంధం మరచిన కూతురు

పేగుబంధం మరచిన కూతురు

ఈ నెల మొదటివారంలో భార్గవి ఇంటికొచ్చింది. తల్లితో ఆస్తి విషయమై గొడవపడింది. లాభం లేదు మట్టుబెట్టాలని భావించింది. తన భర్త, బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచింది. లక్ష్మీ కాళ్లు, చేతులను భర్త, బాయ్‌ప్రెండ్ పట్టుకోగా.. సొంత కూతురే తల్లి గొంతును నులిమేసింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత వదిలిపెట్టింది. సొంత కూతురి చేతిలో లక్ష్మీ ఆసువులు బాసింది. హుటహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లి భార్గవి అండ్ కో నాటకం ఆడారు. చనిపోయిందని తెలిసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఎవరిపై అనుమానం లేదని కాకమ్మ కబుర్లు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు.

ఆగలేక

ఆగలేక

లక్ష్మీకి ఉన్నది ఒక్క కూతురు భార్గవి. ఆమె తదనంతరం ఆస్తి భార్గవికే దక్కుతుంది. తండ్రి లేకపోవడం, తమ్ముడు కూడా చనిపోవడంతో భార్గవి వారసులు అవుతుంది. కానీ లక్ష్మీకి వయస్సు 40 ఏళ్లు మాత్రమే.. ఆమె చనిపోయే వరకు ఆగాలా అని అనుకొంది. అంతేకాదు తల్లితో ఎన్నిరోజులు జీవిస్తానని కూడా అందట. దీనిపై వారి మధ్య గొడవ కూడా జరిగింది. ఆస్తి కోసం గొడవలు జరగడం.. ఈ నెలలో ఇంటికొచ్చిన సందర్భంలో కూడా మాటమాట పెరిగింది. లాభం లేదనుకొని కన్నతల్లినే కర్కశంగా మట్టుబెట్టింది. భార్గవి, భర్త, బాయ్‌ప్రెండ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గోల్డ్ చైన్, రూ.7 వేల నగదు, 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+