విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించిన వైఎస్ జగన్: ఆ ప్రోగ్రామ్‌లో అరుదైన దృశ్యం
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని కొలనుకొండ వద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే భూమిపూజ చేశారు. అలాగే ఆత్మకూరు వద్ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్సియస్‌నెస్ (ఇస్కాన్) నిర్మించిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. ఇస్కాన్ బెంగళూరు విభాగం దీన్ని నిర్మించింది. ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచే జిల్లాలోని పలు పట్టణాలకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతుంది.

50 వేల మందికి..
దీని నిర్మాణానికి ప్రభుత్వం ఆరున్నర ఎకరాలను హరేకృష్ణ మూవ్‌మెంట్‌కు లీజుకు ఇచ్చింది. 50 వేల మందికి ఒకేసారి భోజనం వడ్డించేలా ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మితమైంది. అత్యాధునిక కిచెన్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం కొలనుకొండ వద్ద హరేకృష్ణ మూవ్‌మెంట్ నిర్మించ తలపెట్టిన హరేకృష్ణ గోకుల క్షేత్రం నిర్మాణానికి భూమిపూజ చేశారు. 70 కోట్ల రూపాయల వ్యయంతో ఇది రూపుదిద్దుకోనుంది.

ఆధ్యాత్మిక కేంద్రంగా..
ఇందులో- రాధాకృష్ణుల మందిరం, శ్రీవెంకటేశ్వరస్వామివారి ఆలయం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుగా ఆడిటోరియం, సంస్కార హాల్, కృష్ణ లీలాస్, గోశాల, అన్నదానం హాల్, మెడిటేషన్ హాల్, ఇస్కాన్ ఆశ్రమం, భగవద్గీత గొప్పదనాన్ని వివరించేలా ప్రత్యేకంగా ఓ మ్యూజియాన్ని నిర్మించాల్సి ఉంది. ఆయా పనులన్నింటికీ వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకోనుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేసేలా ఇస్కాన్ ప్రణాళికలను రూపొందించుకుంది.

నుదుట చందన నామాలతో..
వైఎస్ జగన్‌కు ఇస్కాన్, హరేకృష్ణ మూవ్‌మెంట్ ప్రతినిధులు సాదరంగా ఆహ్వానించారు. ఇస్కాన్ ప్రతినిధులు ధరించే నామాలను ఆయన నుదుటను రాశారు. చందనంతో తయారు చేసిన తిలకాన్ని దిద్దారు. పట్టు శాలువాను కప్పి సన్మానించారు. మెడలో పట్టుదండను వేశారు. అక్షయపాత్ర కిచెన్‌ను పనితీరు గురించి వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ వండిన ఆహార పదార్థాలను రుచి చూశారు.

మంత్రులు హాజరు..
ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన హరేకృష్ణ హరేరామ మూమెంట్ నేషనల్ ప్రెసిడెంట్ మధు పండిత్ దాస్, ఏపీ-తెలంగాణ అధ్యక్షులు సత్యగౌరి చందన దాస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు అధికారులు హాజరయ్యారు.

భోజనం వడ్డించిన వైఎస్ జగన్..
ఈ కార్యక్రమం సందర్భంగా ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన- విద్యార్థులకు తన చేతులతో భోజనాన్ని వడ్డించారు. వారితో సరదాగా గడిపారు. ఏ పాఠశాలలో చదువుతున్నారని, భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వైఎస్ జగన్‌ను మామయ్యా అంటూ సంబోధించారు. ఫొటో దిగాలనే వారి కోరికను నెరవేర్చారు. విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.
-
గుంటూరు స్పెషల్ "కోవా మాల్ పూరీ" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications