గురజాల పోలీసు స్టేషన్ల అరుదైన ఘటన-మహిళా కానిస్టేబుల్ కు శ్రీమంతం

పోలీసులు అంటే వెంటనే గుర్తుకొచ్చేది వారి కరకుతనం, దురుసు ప్రవర్తన. ఫ్రెండ్లీ పోలీసింగ్ పై దేశవ్యాప్తంగా అధికారులు ఎన్నోసార్లు పోలీసు సిబ్బందికి గుర్తు చేస్తూనే ఉన్నా ఎప్పటికప్పుడు పోలీసుల ప్రవర్తన విమర్శలకు తావిస్తూనే ఉంటుంది. కానీ అన్ని చోట్లా అలా జరగదనడానికి నిదర్శనంగా గుంటూరు జిల్లా గురజాల పీఎస్ లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా గురజాల పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గర్భం దాల్చింది. దీంతో ఆమెకు శ్రీమంతం వేడుకలు నిర్వహించేందుకు పీఎస్ లో సీఐగా విధులు నిర్వహిస్తున్న తన పై అధికారి సురేంద్రబాబు ముందుకొచ్చారు అదీ పీఎస్ లోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక పోలీసులు తల్చుకుంటే జరగనిది ఏముంది. ఎంచక్కా సదరు మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల్ని పిలిపించి మరీ అక్కడే వేడుకలు జరిపించేశారు.

in a rare guesture, pregnancy celebration to women constable in gurajala police station

తాను కోరుకున్నట్లుగా తాను పనిచేసే పోలీసు స్టేషన్లోనే తన శ్రీమంతం వేడుకలు కూడా జరగడం, అదీ కుటుంబ సభ్యులు కూడా తరలిరావడంతో సదరు కానిస్టేబుల్ ఉబ్బి తబ్బిబ్బయింది. ఇంతకన్నా తనకు గౌరవం ఏముంటుందని ఉద్విగ్నతకు లోనైంది. తన శ్రీమంతం వేడుకను స్టేషన్ లోనే జరిపించిన సీఐ సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. తన శ్రీమంతం వేడుకను జీవీతాంతం గుర్తుండిపోయేలా చేసిన సీఐకి ధన్యవాదాలు తెలిపింది. అటు స్ధానిక ప్రజలు కూడా ఈ వేడుకకు తరలివచ్చి తిలకించారు. వారు కూడా సీఐ సురేంద్రబాబును అభినందించారు. విధి నిర్వహణలోనే కఠినత్వం, వ్యక్తిత్వంలో కనికరం ఉంటుందని నిరూపించిన గురజాల పీఎస్ పోలీసు సిబ్బందికి ఇప్పుడు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+