తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారిని కాపాడుకుందాం..మన విరాళాలు మాత్రమే మోక్షితను బతికిస్తాయి..!

Google Oneindia TeluguNews

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు నింద్ర మోక్షిత. గతేడాది అక్టోబర్ 25వ తేదీకి ఒక ఏడాది పూర్తి చేసుకుంది. కన్నయ్య లీలావతి దంపతులకు మోక్షిత తొలిసంతానంగా జన్మించింది. తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో మోక్షిత జన్మించింది. పుట్టిన సమయంలో చాలా ఆరోగ్యంగా ఉన్నింది. ఇక ఐదు నెలలప్పుడు జ్వరం బారిన పడింది మోక్షిత. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చాలా హైఫీవర్ ఉందని తెలుసుకున్న డాక్టర్లు... వెంటనే పలు పరీక్షలు నిర్వహించారు.

Help to save 1 year old Nindra Mokshita from heart problem

మోక్షితకు పరీక్షలు నిర్వహించిన తర్వాత చికిత్స చేసే ఓ డాక్టరు ఆమె గుండెలో ఏదో సమస్య ఉన్నట్లు గుర్తించారు.దీంతో వెంటనే ఆమెను తిరువల్లూరులోని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ స్కాన్ తీయించాలని సూచించారు. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టును కోరారు. తిరువల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికే ఎందుకు రిఫర్ చేశారంటే... నెలకోసారి చిన్న పిల్లల గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేసే స్పెషలిస్టు అక్కడకు వస్తారు. ఆయనకు చూపించి ఒపీనియన్ తీసుకోమని డాక్టర్లు కన్నయ్య లీలావతి దంపతులకు సూచించారు.

Help to save 1 year old Nindra Mokshita from heart problem

ఇక ఆ డాక్టరుకు మోక్షితను చూపించగానే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన నిర్థారించారు. ఇక అదే సమయంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అమలైంది. ఇక అక్కడి నుంచి మోక్షిత తల్లిదండ్రులకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి మెడిసిన్స్ తీసుకుంటూ కాలం వెల్లదీస్తోంది మోక్షిత. అయితే పలు ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు పలకరించి పోతున్నాయి. ఆమెకు సర్జరీ చేయాలని ఆ డాక్టరు చెప్పారు. అయితే అంత డబ్బులు భరించే ఆర్థిక పరిస్థితి తమది కాదని చెబుతున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు.

Help to save 1 year old Nindra Mokshita from heart problem

మోక్షిత ఓపెన్ హార్ట్ సర్జరీకి రూ.2,60,000 ఖర్చు అవుతుందని చెప్పారు. ఇందులోనే సర్జరీతో పాటు ఐసీయూ, హాస్పిటల్‌ ఛార్జీలు, ఆపరేషన్ తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్స్, మెడికేషన్ ఖర్చులన్నీ వస్తాయి. మెషీన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మోక్షిత తండ్రి కన్నయ్యకు ఇంత మొత్తంలో డబ్బులు సమకూర్చాలంటే చాలా కష్టంగా మారింది. మరోవైపు రోజు రోజుకు మోక్షిత ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ క్రమంలోనే దంపతులు తమ పాపను రక్షించాల్సిందిగా కోరుతున్నారు. చిన్నారిని ఆదుకునేందుకు తోచినంత సహాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. మీ వంతు సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X