Girl: అమ్మాయిని కిడ్నాప్ చేసి ?, క్లైమాక్స్ లో ఎన్ కౌంటర్ జస్ట్ మిస్, బుల్లెట్ రుచితో కుయ్యో !
చెన్న/కాంచీపురం: యువతి పని మీద బయటకు వెళ్లింది. తరువాత వెళ్లిన పని ముగించుకున్న యువతి రాత్రి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో యువతిని కత్తులతో బెదిరించిన నిందితులు ఆమెను బైక్ లో ఎత్తుకెళ్లారు. యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు నిందితుల ఆచూకి తెలుసుకున్నారు. పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల మీద కామాంధులు కత్తులతో విరుచుకుపడ్డారు. అసలే పోలీసులు, ప్రభుత్వం ఇచ్చిన తుపాకులు దగ్గర ఉంటే ఊరికే ఉంటారా ? తరువాత సీన్ మొత్తం మారిపోయింది.

యువతి కిడ్నాప్..... గ్యాంగ్ రేప్
తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ లోని ఎంజీఆర్ నగర్ లో నివాసం ఉంటున్న 20 ఏళ్ల యువతి డిసెంబర్ 11వ తేదీ రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో శ్రీపెరంబుదూర్ ఎంజీఆర్ నగర్ సమీపంలోని రోడ్డుపైన యువతి నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో బైక్‌పై వెళ్లిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యువతిని కత్తితో బెదిరించి ఆమెను బైక్ మధ్యలో కుర్చోబెట్టుకుని వెళ్లిపోయారు. శ్రీపెరంబుదూర్ శివార్లలోని నిర్జనప్రదేశంలోకి యువతిని తీసుకెళ్లి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు.

కేసు పెడితే చంపేస్తాము
గ్యాంగ్ రేప్ విషయం ఎవరికైనా చెప్పినా, పోలీసు కేసు పెట్టినా మరోసారి గ్యాంగ్ రేప్ చేసి నిన్ను చంపేసి శవం మాయం చేస్తామని కామాంధులు ఆమెను బెదిరించారు. అయితే బాధితురాలి ధైర్యంగా ఫిర్యాదు చెయ్యడంతో శ్రీపెరంబుదూర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ పెరంబుదూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు.

కామాంధుల క్లూ చిక్కింది
పోలీసుల విచారణలో తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కుమ్మిడిపూండి సున్నం చెరువు పెరుమాళ్ గుడి వీధికి చెందిన నాగరాజ్ అలియాస్ నాగ (31, ప్రకాష్ (31) అనే ఇద్దరు కామాంధులు 20 ఏళ్ల యువతి మీద గ్యాంగ్ రేప్ చేశారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితులు నాగ, ప్రకాష్ ను పట్టుకోవడానికి ప్రత్యేక బలగాలు గాలించాయి. కాంచీపురం సమీపంలోని పలుశెట్టి చత్రం ప్రాంతంలో నాగ, ప్రకాష్ తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు నిందితులు ఉన్న చోటకు వెళ్లి లొంగిపోవాలని ఇద్దరిని హెచ్చరించారు.

ఎన్ కౌంటర్ జస్ట్ మిస్
పోలీసులను చూసి నాగ, ప్రకాష్ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో పోలీసులు వారి వెంటపడ్డారు. ఆ సందర్బంలో నాగ, ప్రకాష్ కత్తులతో పోలీసుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే ఆత్మరక్షణ కోసం ఇద్దరు నేరస్తులపై కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నాగ అలియాస్ నాగరాజ్, ప్రకాష్ కాళ్లల్లోకి బుల్లెట్లు దూసుకుపోయి గాయాలైయి. దీంతో నాగ, ప్రకాష్ తప్పించుకోలేక అక్కడే కుప్పకూలిపోయారు. కాంచీపురం పోలీసులు వెంటనే నాగ, ప్రకాష్ ను చికిత్స నిమిత్తం కాంచీపురం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు కామాంధుల మీద పోలీసులు కాల్పులు జరిపడం కాంచీపురం జిల్లాలో కలకలం రేపింది.

పాతనేరస్తులు
యువతి మీద సామూహిక అత్యాచారం చేశామని నాగ, ప్రకాష్ అంగీకరించారని పోలీసు అధికారులు అంటున్నారు. గతంలో నాగ, ప్రకాష్ కాంచీపురం, అరక్కోణం, తిరువళ్లూరు, సెయ్యూరు తదితర ప్రాంతాల్లో దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు, దొంగతనం చేశారని పోలీసులు అన్నారు. నాగ మీద దోపిడీ, దొంగతనాల కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు చెప్పారు.

పోలీసులు అని చెప్పి గ్యాంగ్ రేప్
పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. రాత్రి ఒంటరిగా వెలుతున్న 20 ఏళ్ల యువతిని నిలిపి మేము పోలీసులు అని పరిచయం చేసుకున్నామని నాగ, ప్రకాష్ చెప్పారని కాంచీపురం పోలీసులు అన్నారు. మేము పోలీసులమని చెప్పి యువతిని బలవంతంగా బైక్ లో ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరి నుంచి కొడవలి, కత్తి, కట్టర్, రాడ్ తో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని కాంచీపురం పోలీసులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications